Uttarakhand: యమునోత్రి జాతీయ రహదారిపై కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది.
యమునోత్రి ఆలయానికి వెళ్లేందుకు భక్తులకు వీలు పడటం లేదు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆ వైపు వెళ్లే రహదారిపై రక్షణ గోడ కూలడంతో జాతీయ రహదారిపైనే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.

Char Dham Yatra
Uttarakhand: యమునోత్రి ఆలయానికి వెళ్లేందుకు భక్తులకు వీలు పడటం లేదు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆ వైపు వెళ్లే రహదారిపై రక్షణ గోడ కూలడంతో జాతీయ రహదారిపైనే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పదివేల మంది ప్రయాణికులు ఆ రహదారిపై నే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే ట్రాఫిక్ లో చిక్కుకున్న చిన్నచిన్న వాహనాలను అధికారులు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Char dham yatra: చార్ ధామ్ యాత్రికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక సూచన..
ఉత్తరాఖండ్ లోని యమనోత్రి రహదారిపై కొండచరియలు పడకుండా నిర్మించిన రక్షణ గోడ కూలిన ఘటనతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో 10 వేల మందికి పైగా ప్రయాణికులు ఈ రహదారిపై చిక్కుకుపోయారు. కూలిన రక్షణ గోడ తొలగిస్తే కానీ వారు బయటకు రాలేని పరిస్ధితులు నెలకొన్నాయి. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో 10,000 మంది ప్రజలు హైవే వెంబడి వివిధ ప్రదేశాలలో చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యల తర్వాత ఈ రహదారి మళ్లీ తెరవడానికి మూడు రోజులు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా యంత్రాంగం కొన్ని చిన్న వాహనాల నుంచి ప్రయాణికులను తరలించేందుకు యత్నిస్తుండగా దూరప్రాంతాల నుంచి పెద్ద వాహనాల్లో వచ్చిన వారు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ రహదారి పూర్తిగా తెరవబడుతుందని వేలాది మంది ప్రయాణికులు ఎదురుచూస్తుండగా, యమునోత్రి ఎమ్మెల్యే సంజయ్ దోవల్,. జాతీయ రహదారి పబ్లిక్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకటిన్నర లేదా రెండు గంటల్లో ఈ రహదారిని పెద్ద వాహనాల కోసం తెరవవచ్చని పేర్కొన్నారు. అనేక చిన్న వాహనాలను తరలిస్తున్నందున, ఈ మార్గంలో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.