Operation Sindoor: 100 మంది ఉగ్రవాదులు హతం.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతుంది.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ..

Operation Sindoor: 100 మంది ఉగ్రవాదులు హతం.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతుంది.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Defence Minister Rajnath Singh

Updated On : May 8, 2025 / 2:12 PM IST

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. తొమ్మిది ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. అయితే, ఈ దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టతరాలేదు. తాజాగా.. ఇందుకు సంబంధించిన వివరాలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.

Also Read: Pakistan: పరుగు తీయండ్రోయ్..! పాకిస్థాన్‌లోని లాహోర్‌ ప్రాంతంలో వరుస పేలుళ్లు.. ఇండ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు.. అసలేం జరిగిందంటే..?

గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత సైనం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందన ఈ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని చెప్పారు. పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం వెనక్కి తగ్గేది లేదని.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని అన్నారు.

 

అఖిలపక్ష సమావేశంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్ సభ ఎల్ఓపీ రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. సమావేశంలో కేంద్రం పెద్దలు ఏమి చెప్పారో మేము విన్నాము. కొన్ని రహస్య సమాచారాన్ని బయట పంచుకోలేము. మేమందరం ప్రభుత్వంతో ఉన్నామని కేంద్రంతో చెప్పామని ఖర్గే అన్నారు. సరిహద్దుల్లో నివసిస్తున్న భారత ప్రజల భద్రత అంశాన్ని మేమందరం లేవనెత్తాము. పూంచ్ సెక్టార్‌లో ప్రాణాలు కోల్పోయిన వారిని, వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా సూచించాము. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మేము ఏ అంశంపైనా ఒత్తిడి చేయలేదు. పార్లమెంటు సమావేశాన్ని పిలవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఎందుకంటే అది మంచి అభిప్రాయాన్ని ఇస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మేము ప్రభుత్వానికి పూర్తి మద్దతును అందిస్తున్నాము. ఖర్గే చెప్పినట్లుగా కేంద్రం మేము చర్చించకూడదనుకునే కొన్ని విషయాలు ఉన్నాయని చెప్పారు.