Kolkata 100 Years Tea : ఈ టీ షాప్‌కి వందేళ్ల చరిత్ర .. రాగిపాత్రలో తయారు చేసే టీ ఫుల్ ఫేమస్..
సిటీ ఆఫ్ జాయ్ కోల్‌కతాలో.. కొత్త కేఫ్‌లు, రెస్టారెంట్‌లు పుట్టుకొస్తూనే ఉన్నా..బెంటింక్ స్ట్రీట్‌లోని ఓ మూలలో.. వందేళ్లుగా అద్భుతమైన టేస్ట్ కలిగిన ఓ టీని తయారు చేస్తున్నారు. ఈ వందేళ్ల చరిత్ర కలిగిన పురాతన టీ షాప్ ఇప్పటికీ నగరం నడిబొడ్డున చెక్కు చెదరకుండా ఉంది.

Kolkata 100 Years Tea
Kolkata 100 Years Tea Shop : ఒక టీకి వందల ఏళ్ల చరిత్ర ఉండొచ్చు. కానీ.. ఆ టీ అమ్మే టీ షాప్‌కి కూడా వందేళ్ల చరిత్ర ఉందంటే నమ్ముతారా? ఇప్పటికీ ఆ టీ కోసం పడి చచ్చేవాళ్లు ఉన్నారంటే ఒప్పుకుంటారా? అలాంటి.. ఓ పురాతన టీ షాప్ ఇప్పటికీ ఉంది. అక్కడ చాయ్ తాగేందుకు.. స్థానికులు ప్రతీరోజు వస్తారు. అక్కడి టీ గొంతులోకి దింగందే వారికి రోజు గడిచినట్లే ఉండదు. అసలు.. ఆ టీ షాప్ కు ఎందుకంత క్రేజ్..? ఆ చాయ్ ఎందుకంత ఫేమస్..?
సిటీ ఆఫ్ జాయ్ కోల్‌కతాలో.. కొత్త కేఫ్‌లు, రెస్టారెంట్‌లు పుట్టుకొస్తూనే ఉండొచ్చు. కానీ.. అదే కోల్‌కతాలో బెంటింక్ స్ట్రీట్‌లోని ఓ మూలలో.. వందేళ్లుగా అద్భుతమైన టేస్ట్ కలిగిన ఓ టీని తయారు చేస్తున్నారు. ఈ వందేళ్ల చరిత్ర కలిగిన పురాతన టీ షాప్ ఇప్పటికీ నగరం నడిబొడ్డున చెక్కు చెదరకుండా ఉంది. ఆ దారి వెంట ఆఫీసులకు వెళ్లే వాళ్లందరినీ.. భారీ సంఖ్యలో ఆకర్షిస్తూ ఉంటుంది ఈ టీ షాప్.
ఈ టీ షాపులో.. 20 లీటర్ల కెపాసిటీ గల సమోవర్ అని పిలిచే.. ఓ పెద్ద రాగిపాత్రలో ఉంచిన నీటితో.. టీ తయారు చేస్తారు. మట్టితో తయారుచేసిన కప్పుల్లో.. దీనిని సర్వ్ చేస్తారు. ఈ టీలో.. అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని టీ షాపు యజమాని చెబుతున్నారు. ఇలాంటి టీ మార్కెట్‌లో ఎక్కడా దొరకదు. వందేళ్లుగా ఇలాంటి టీ.. ఈ ఒక్క షాపులో మాత్రమే దొరుకుతోంది. పైగా ఈ రాగి పాత్రలో ఉంచిన నీరు.. కాలేయానికి మేలు చేస్తుందని.. టీ షాప్ ఓనర్ చెబుతున్నారు. ఇంత చరిత్ర ఉన్నా వ్యాపారం మాత్రం కొంత డల్‌గానే నడుస్తోంది. కరోనా మహమ్మారితో పాటు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందించే సౌలభ్యం.. ఈ చిన్న వ్యాపారాన్ని కొంత మేర దెబ్బతీశాయ్.
అయితే.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కోల్ కతా వాసుల అభిరుచి ఈ వందేళ్ల చరిత్ర ఉన్న టీ ఇంకా అందుబాటులో ఉండటానికి కారణమని చెప్పొచ్చు. మండు వేసవిలోనూ.. ఇక్కడ వేడి వేడి టీ తాగేందుకు.. చాయ్ లవర్స్ అంతా ఇక్కడికి వస్తున్నారు. ఓ కప్పు టీ తాగి.. అద్భుతమైన టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.
Kerala AI Camaras : దేశంలోనే తొలిసారి కేరళలో AI టెక్నాలజీ కెమెరాలతో చలాన్లు ..