Lok Sabha Seats : లోక్ సభ స్థానాల సంఖ్య 1000కి పెంచే యోచనలో మోదీ సర్కార్!
లోక్ సభలో ప్రస్తుతమున్న 543 స్థానాలను 1000కి పెంచే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

Pa
Lok Sabha Seats లోక్ సభలో ప్రస్తుతమున్న 543 స్థానాలను 1000కి పెంచే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. 2021 లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ చేపట్టాలని ఎన్డీయే సర్కార్ భావిస్తోందని అమృత్ సర్ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కొందరు తన సహచర బీజేపీ ఎంపీల ద్వారా ఈ సమాచారం తెలిసినట్లు ఆయన సోమవారం ఓ ట్వీట్ లో తెలిపారు. కొత్త పార్లమెంట్ ఛాంబర్ ని కూడా 1000మంది కూర్చొనే సమార్థ్యం ఉండేలా నిర్మిస్తున్న విషయాన్ని మనీష్ తివారీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే పార్లమెంట్ స్థానాలను పెంచే ముందు దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ సీరియస్ గా జరగాలని తివారీ తెలిపారు. ప్రతిపాదిత ఐడియాలో మహిళలకి 1/3 వంతు రిజర్వేషన్ కూడా ఉన్నట్లు తెలిసిందని తివారీ తెలిపారు.
అయితే, లోక్ సభలో సీట్ల సంఖ్యను 1000కి పెంచాల్సిన అవసరముందని 2019లో దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఓ సందర్భంగా చెప్పిన విషయం తెలిసిందే. రాజ్యసభలోనూ మరియు రాష్ట్రాల శాసనసభల్లో కూడా సీట్ల సంఖ్య పెంచాల్సిన అవరసముందని అప్పుడు ప్రణబ్ వ్యాఖ్యానించారు.