Covid-19 దెబ్బకు హాస్పిటల్‌లో చేరిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

అస్సాంలో 45వ కరోనా కేసు నమోదైంది. ఈ కేసు డాక్టర్లతో పాటు పోలీసులకు కూడా కీలకమైంది. మోస్ట్ వాంటెడ్ దొంగ పోలీసుల చేతికి చిక్కకుండా దొరుకుతున్న వ్యక్తి Covid-19 కారణంగా దొరికిపోయాడు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇరు రాష్ట్రాల పోలీసులను సంవత్సర కాలంగా తిప్పలు పెడుతున్నాడు.
సోనిట్‌పూర్‌కు చెందిన ఈ వ్యక్తి 41 తీర్థయాత్రికులతో పాటుగా కచార్ జిల్లాలోని సిల్చార్ కు అజ్మీర్ షరీఫ్ నుంచి బస్సులో వచ్చాడు. చేరుకోగానే ప్రయాణికుందరికీ టెస్టులు చేశారు. ఫ్లూ, ఇతర జబ్బులు ఉన్నవారిని క్వారంటైన్ కు పంపారు. వారి పేర్ల టీవీలో ప్రకటిస్తుండటంతో తెలమారా పోలీస్ అవుట్ పోస్టులో ఉన్న భోలా రామ్ బోరా క్రిమినల్ పేరు విని అలర్ట్ అయ్యాడు.
న్యూస్ రీడర్ అతను సోనిట్‌పూర్‌కు చెందిన వ్యక్తిగా చెప్పింది. అతని ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే అతను అజ్మీర్ షరీఫ్ వెళ్లాడని చెప్పింది. ఆల్రెడీ గతంలోనే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. విడుదల అయిన తర్వాత మళ్లీ అదే పని కొనసాగించాడు. హెల్త్ మినిష్టర్ హిమంత బిస్వ శర్మ గురువారం నిందితుడికి Covid-19 పాజిటివ్ గా నిర్దారించారు.
బుధవారం రాత్రి ల్యాబ్ రిపోర్టులు వచ్చాయి. అతణ్ని సిల్చార్ లో క్వారంటైన్ లో ఉంచాం. అతనిపై ఉన్న క్రిమినల్ కేసులను పోలీసులు విచారిస్తున్నారు. అతనితో పాటు క్లోజ్ గా ప్రయాణించిన వ్యక్తులను కూడా క్వారంటైన్ కు తరలించారు.
Read More :
* ఒకే జైలులో 77మందికి కరోనా పాజిటివ్