ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీలో 11మందికి కరోనా పాజిటివ్

దేశంలోనే అతిపెద్ద హోల్ సేల్ పండ్లు మరియు కూరగాయల మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండికి చెందిన 11మంది వ్యాపారులకు కరోనా వైరస్ సోకినట్లు తేలిందని డిస్ట్రిక్ మెజిస్ట్రేల్(నార్త్)దీపక్ షిండే తెలిపారు. వ్యాపారులు మండికి డైరక్ట్ గా కనెక్ట్ అయిన వారు కాదని, తాము కేసుల కాంటాక్ట్(పరిచయాలు)లను ట్రేసింగ్ చేస్తున్నామని షిండే తెలిపారు.
కాగా,ఇటీవల ఆజాద్ పూర్ మండి సరి-బేసి రూల్స్ ప్రవేశపెట్టి,మళ్లీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం అన్ని ఎసెన్షియల్ సర్వీసెస్(అత్యవసరమైన సేవలు)కు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో 80ఎకరాలకు పైగా ఉన్న ఆజాద్ పూర్ మండి లాక్ డౌన్ సమయంలో కూడా పనిచేస్తూనే ఉంది. ప్రస్తుతం కరోనా కేసులు రావడంతో ప్రస్తుతం మండిలోని దుకాణాలకు సీలు వేశారు. అలాగే ఇక్కడి వ్యాపారులతో పరిచయం వున్నవ్యక్తులను క్వారంటైన్ కు తరలించారు.
ఈ మండీకి చెందిన ఒక వ్యాపారి మృతి చెందాడు. దీనితో అతనితో పరిచయం ఉన్న వ్యక్తులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఢిల్లీలో కరోనా సోకిన రోగుల సంఖ్య 3 వేల 314 కుచేరింది. అందులో 54 మంది మృతిచెందారు. రోగుల రికవరీ రేటు 32.52 శాతానికి పెరిగింది. వెయ్యి మందికి పైగా రోగులు కరోనా నుండి కోలుకున్నారు.