Italy Corona Flight: ఇటలీ నుంచి వచ్చిన 125 మంది కరోనా ప్యాసింజర్లలో 13 మంది పరార్
ఇటలీ నుంచి ఇండియాలోని అమృత్‌సర్ వచ్చిన విమానంలో 125 మంది ప్యాసింజర్లకు కరోనా నిర్ధారణ జరగడం దేశంలో ఒక్కసారిగా అలజడి రేగింది

Corona Flight
Italy Corona Flight: గురువారం నాడు ఇటలీ నుంచి ఇండియాలోని అమృత్‌సర్ వచ్చిన విమానంలో 125 మంది ప్యాసింజర్లకు కరోనా నిర్ధారణ జరగడం దేశంలో ఒక్కసారిగా అలజడి రేగింది. కరోనా నిర్ధారణ అయిన వారిని ఆసుపత్రిలో చేర్పించగా.. వారిలో 13 మంది ఆసుపత్రి నుంచి పరారవడం తీవ్ర కలకలం రేగుతుంది. ఇప్పటికే దేశంలో కరోనా ఉగ్ర రూపం దాల్చుతున్న తరుణంలో విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకేసారి ఇన్ని కేసులు నమోదు అవడంపట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 179 మంది ప్యాసింజర్లలో 125 మంది కరోనా భారిన పడగా..కరోనా నిర్ధారణ అయినవారిని చికిత్స నిమిత్తం అమృత్‌సర్ లోని గురునానక్ దేవ్ హాస్పిటల్ కు తరలించారు.
Also read: Students Food Poison: 40 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు అస్వస్థత
మిగతా ప్యాసింజర్లను క్వారంటైన్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 13 మంది కరోనా బాధితులు.. ఆసుపత్రి సిబ్బంది కళ్లుగప్పి అక్కడి నుండి పరారయ్యారు. దీనిపై ఆసుపత్రి వర్గాలు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆసుపత్రి నుంచి పరారైన వారిపై అంటువ్యాధులు మరియు విపత్తు నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేసిన అమృత్‌సర్ పోలీసులు.. వారు తిరిగిరాని పక్షంలో వారి పాసుపోర్టులను రద్దు చేస్తామని ప్రకటించారు. పరారైనవారి వివరాలను ఫొటోలతో సహా వార్తాపత్రికల్లో ప్రచురిస్తామని అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ గురుప్రీత్ సింగ్ ఖెహ్రా పేర్కొన్నారు
Also read: PM Modi: ప్రధానికి భద్రతా వైఫల్యం అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు