Students Food Poison: 40 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు అస్వస్థత

కర్నూలు నగరంలోని రావేంద్ర, పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీల్లో 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విషయంపై కళాశాల యాజమాన్యాలు గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తుంది.

Students Food Poison: 40 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు అస్వస్థత

Food Poison

Students Food Poison: కర్నూలు నగరంలోని రావేంద్ర, పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీల్లో 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విషయంపై కళాశాల యాజమాన్యాలు గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తుంది. గురువారం రాత్రి కళాశాల హాస్టల్లో భోజనం చేసిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పలువురు విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీలోని విద్యార్థులు ఈవిషయాన్ని హాస్టల్ వార్డెన్ల దృష్టికి తీసుకువచ్చారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం.. రహస్యంగా ముగ్గురు వైద్యులను హాస్టల్ కు పిలిపించి.. అస్వస్థకు గురైన విద్యార్థులకు వైద్యం అందించారు.

Also read: PM Modi: ప్రధానికి భద్రతా వైఫల్యం అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు

రెండు కళాశాలల్లో మొత్తం 40 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురవ్వగా.. 15 మంది విద్యార్థులు తీవ్రంగానూ, 5 ఐదుగురి పరిస్థితి అతి తీవ్రంగానూ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై కళాశాల యాజమాన్యాలు గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తుంది. హాస్టల్లో తిన్న తిండి ఫుడ్ పాయిజన్ కావడంతోనే విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని స్థానికంగా ప్రచారం జరిగింది. విద్యార్థుల పరిస్థితిపై కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. ఒక్కసారిగా 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో హాస్టల్ లోని మిగతా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Also read: Chocolate Paniprui: ఇది చాకొలేట్ పానీపూరి