బీహార్‌లో రైలు ప్రమాదం : పట్టాలు తప్పిన తపతి-గంగా ఎక్స్‌ప్రెస్

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 06:14 AM IST
బీహార్‌లో రైలు ప్రమాదం : పట్టాలు తప్పిన తపతి-గంగా ఎక్స్‌ప్రెస్

Updated On : March 31, 2019 / 6:14 AM IST

బీహార్ లో రైలు ప్రమాదం జరిగింది. తపతి-గంగా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఆదివారం(మార్చి 31, 2109) ఉదయం 9గంటల 45 నిమిషాలకు బీహార్‌లోని చాప్రా దగ్గర గౌతమ్ ఆస్థాన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉన్నాయి.

రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు. పట్టాలకు మరమ్మత్తులు చేస్తున్నారు. రైలు రాకపోకలను పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరిలో సీమాంచల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో ఆరుగురు చనిపోయారు.