గాయపడిన తండ్రిని సైకిల్ ఎక్కించుకుని..1200 కి.మీటర్లు తొక్కుతూ సొంతూరుకు చేరిన బాలిక

  • Published By: nagamani ,Published On : May 20, 2020 / 07:29 AM IST
గాయపడిన తండ్రిని సైకిల్ ఎక్కించుకుని..1200 కి.మీటర్లు తొక్కుతూ సొంతూరుకు చేరిన బాలిక

10 కాదు 20 కాదు ఏ సైకిల్ రేసుకు సాటి రాని ప్రయాణం ఆ బాలికది. 15 సంవత్సరాల బాలిక.12 వందల కిలోమీటర్ల దూరం పాటు తండ్రిని  సైకిల్ పై ఎక్కించుకుని తొక్కుకుంటూ చేరుకున్న ఘటన అబ్బురపరచకమానదు. ఇది కరోనాతో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తున్న అంత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో  కొనసాగుతున్న లాక్‌డౌన్‌ వెలుగులోకి తీసుకొస్తున్న దీనగాథలు. ఎప్పుడూ వినని వలస వేదనలు. వలస ఘోషల కథలు ఎన్ని విన్నా..ఒకటే సంకల్పం. పొట్ట చేత పట్టుకుని జిల్లాలు దాటి రాష్ట్రాలు  దాటి..వలస జీవుల వేదనలు. బడుగు జీవుల బ్రతుకు కథలు. 

కరోనా భూతం వెంటాడుతోంది. లాక్ డైన్  ఉన్న ఊరు నుంచి పొమ్మంటోంది. కన్నఊరు చేతులు చాచి రమ్మంటోంది. మరి కష్టాల సుడిగుండం తప్పదని తెలిసినా..బడుగు జీవి ప్రాణం ఆగుతుందా? కన్న ఊరివైపే మండుటెండను కూడా లెక్క చేయకుండా సాగిపోతోంది. 

లాక్ డైన్ కొనసాగుతున్న క్రమంలో గ్రామానికి వెళ్లే క్రమంలో గాయపడిన తన తండ్రిని ఓ బాలిక (15) సైకిల్‌పై ఎక్కించుకుని 1,200 కిలోమీటర్లు ప్రయాణించింది.  సంత్సరాల బాలిక తండ్రిని సైకిల్ పై ఎక్కించుకుని ఢిల్లీ నుంచి బీహార్ కు పయనమైంది. 1200ల కిలోమీటర్లు సైకిల్ పై ఎక్కించుకుని తొక్కుకుంటూ సొంత ఊరికి చేరుకుంది. 

బీహార్‌లోని దర్భాంగకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం ఢిల్లీలో తన 15 ఏళ్ల కూతురు జ్యోతితో కలిసి నివసిస్తున్నాడు. రిక్షా అద్దెకు తీసుకుని..తొక్కుతూ వచ్చిన అరాకొరా డబ్బులతో బతుకు బండిని నెట్టుకొచ్చేవాడు. కానీ లాక్‌డౌన్‌ వారి కష్టాలకు మరింత కష్టాల్లోకి నెట్టేసింది. కిరాయికి తీసుకొచ్చిన రిక్షాను యజమాని తిరిగి తీసేసుకున్నాడు. దీంతో తాను అద్దెకు ఉండే ఇంటి యజమాని అద్దె ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేశాడు. తన దగ్గరున్న కొద్దిపాటి వస్తువులు అమ్మేసి అద్దె బాకీ ఇచ్చేసాడు. ఇక ఇక్కడ బతకలేమని..సొంతఊరికి వెళ్లిపోదామనుకున్నాడు.

ఢిల్లీ నుంచి బీహార్ వెళ్లటానికి ఓ ట్రక్కు డ్రైవర్‌ను అడగగా..అతడు అడిగిన కిరాయి ఇవ్వలేని స్థితి తనది అనుకుని మారు మాట్లాడకుండా వచ్చేశాడు. కానీ సొంత ఊరికి వెళ్లాలి? ఎలా? అనుకుంటూ..రూ.500లకు ఓ సైకిల్‌ను కొన్నాడు.

అలా  మే 10,2020న ఢిల్లీ నుంచి దర్భాంగకు సైకిల్‌పై కూతురితో బయల్దేరాడు. కానీ కొద్ది దూరానికి అతనికి గాయాలయ్యాయి. దీంతో తండ్రి బాధ్యతను తాను తీసుకుంది. తండ్రిని ఎక్కించుకుని రాత్రి పగలూ సైకిల్ తొక్కుతూ బీహార్ లోని సొంతూరికి మే 19న చేరుకుంది.  ఢిల్లీలో బయలుదేరినప్పుడు తండ్రీకూతుళ్లను అధికారులు క్వారంటైన్‌కు తరలించి, కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ అని తేలింది.

దీనిపై జ్యోతి మాట్లాడుతూ..తాను రాత్రి సమయంలో కూడా సైకిల్ తొక్కటం ఆపలేదనీ..రాత్రి సమయంలో ప్రయాణంతో తనకు ఏమాత్రం భయం వేయలేదనీ..ఎందుకంటే దారి పొడుగునా తనలాంటి వలస కూలీలే కనిపించారు. ఎవరికి వారు వారి వారి ఊళ్లకు చేరుకోవాలని తపనతో కష్టాల్ని సైతం లెక్కచేయకుండా పయనిస్తున్నారనీ తనలాంటివారికి దారిలో స్థానికులు సహాయం చేసేవారని తెలిపింది 15 ఏళ్ల జ్యోతి. ఇటువంటి కథలు లాక్ డౌన్ లో ఎన్నో..ఎన్నెన్నో వాస్తవాలను కళ్లకు కడుతున్నార. ఎంత కష్టం..ఎంత కష్టం..వలస వచ్చిన బడుగు జీవికి ఎంత కష్టం అనిపిస్తున్నాయి.

Read: స్పీడ్ పెంచిన కరోనా.. ఇండియాలో 24 గంటల్లో 5వేల 611కేసులు