Wayanad: వయనాడ్‌ నుంచి ప్రియాంకా గాంధీతో పోటీ పడుతున్న 15 మంది అభ్యర్థులు

యూడీఎఫ్‌ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తుండగా, ఎల్‌డీఎఫ్‌ నుంచి సత్యన్ మోకేరి, ఎన్డీఏ నుంచి నవ్య హరిదాస్ పోటీ చేస్తున్నారు.

Wayanad: వయనాడ్‌ నుంచి ప్రియాంకా గాంధీతో పోటీ పడుతున్న 15 మంది అభ్యర్థులు

Priyanka Gandhi

Updated On : October 30, 2024 / 9:45 PM IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ నియోజక వర్గం నుంచి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. అక్కడ జరగనున్న ఉప ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

వారిలో అధిక మంది స్వతంత్రులే ఉన్నారు. యూడీఎఫ్‌ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తుండగా, ఎల్‌డీఎఫ్‌ నుంచి సత్యన్ మోకేరి, ఎన్డీఏ నుంచి నవ్య హరిదాస్ పోటీ చేస్తున్నారు. వయనాడ్ నియోజక వర్గ ఎన్నిక షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ ముగిసింది. దీంతో 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు స్పష్టమైంది.

ఈ ఉప ఎన్నిక ద్వారా ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రియాంకా గాంధీ, ఎల్‌డీఎఫ్‌, ఎన్డీఏ అభ్యర్థులు కాకుండా ఇతర 13 మంది స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. పోటీలో నిలిచిన అభ్యర్థులు అందరూ ఇప్పటికే ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. వయనాడ్‌లో నవంబరు 13 ఓటింగ్ జరుగుతుంది. అలాగే, నవంబరు 23న ఫలితాలు వెల్లడవుతాయి.

టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..