Mizoram : మిజోరంలో కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 17 మంది మృతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని

మిజోరంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. చాలామంది ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. వంతెన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు.

Mizoram : మిజోరంలో కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 17 మంది మృతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని

Mizoram

Updated On : August 23, 2023 / 2:14 PM IST

Mizoram : మిజోరంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన కూలిపోవడంతో 17 మంది మృతి చెందారు. పలువురు కార్మికులు బ్రిడ్జి శిథిలాల క్రింద చిక్కుపోయినట్లు ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్రమోడి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Road Accident : లద్దాఖ్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం, 9 మంది సైనికులు మృతి

మిజోరంలోని ఐజ్వాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయిరాంగ్ ప్రాంతంలో రైల్వే వంతెన నిర్మాణం జరుగుతోంది. నిర్మాణంలో ఉన్న ఈ వంతెన అకస్మాత్తుగా కూలిపోవడంతో 15 మంది కార్మికులు చనిపోయారు. చాలామంది వంతెన శిథిలాల క్రింద చిక్కుకుపోయినట్లు ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినపుడు 35 నుంచి 40 మంది కార్మికులు పనిలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. శిథిలాల నుండి 17 మృతదేహాలను వెలికితీశామని.. ఇంకా చాలామంది ఆచూకీ తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనపై మిజోరం సీఎం జోరంతంగ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన ట్విట్టర్ అకౌంట్ లో (@ZoramthangaCM) ‘ఐజ్వాల్ సమీపంలోని సాయిరాంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ఈరోజు కూలిపోయింది.. ఈ ఘటనలో 17 మంది కార్మికులు మరణించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయపడటానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు.

DRDO Drone: పొలాల్లో కుప్పకూలిన డీఆర్‌డీవో డ్రోన్.. భయాందోళనకు గురైన స్థానికులు

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారిక కుటుంబాలకు PMNRF నుండి రూ.2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50,000 లు అందజేయనున్నారు. ఈ మేరకు PMO నుంచి ట్విట్టర్లో విడుదల చేశారు. మరోవైపు కూలిన వంతెన వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.