కర్ణాటక అసెంబ్లీని కుదిపేసిన హనీట్రాప్ వివాదం.. 18 మంది బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌.. వారిని ఎలా మోసుకెళ్లారో చూడండి..

సీడీలతో పాటు పెన్‌డ్రైవ్‌లలో వారికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని తెలిపారు.

కర్ణాటక అసెంబ్లీని కుదిపేసిన హనీట్రాప్ వివాదం.. 18 మంది బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌.. వారిని ఎలా మోసుకెళ్లారో చూడండి..

Updated On : March 21, 2025 / 6:50 PM IST

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ ఇవాళ 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలలపాటు సస్పెండ్ చేశారు. కర్ణాటకలో హనీ ట్రాప్‌ వ్యవహారం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. మంత్రులు సహా అనేక మంది ముఖ్యనేతలు వలపు వలలో చిక్కుకున్నారని కర్ణాటక మంత్రి కేఎన్‌ రాజన్న అసెంబ్లీలో పేర్కొన్నారు.

దీంతో ఇవాళ ఈ విషయాన్ని కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ నేతలు లేవనెత్తి, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. హనీ ట్రాప్‌ విషయాన్ని పట్టించుకోకుండా ముస్లిం కోటా బిల్లుకు ఆమోదం తెలపడం ఏంటంటూ స్పీకర్‌ చుట్టూ చేరిన బీజేపీ నేతలు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియాన్ని ఎక్కేందుకు ప్రయత్నించారు.

Also Read: ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకునే నాలుగు జట్లు ఇవే.. మాజీ క్రికెటర్ల అంచనా.. 2 దిగ్గజ టీమ్‌లకు షాక్

దీంతో స్పీకర్‌ స్థానాన్ని అగౌరవపరిచారంటూ 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను యూటీ ఖాదర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలలో సీఎన్ అశ్వత్ నారాయణ్, బీ సురేశ్ గౌడ, ఉమానాథ్ కోట్యాన్, సీకే రామమూర్తి, ధీరజ్, మునిరాజు, మునిరత్న, ఎస్ఆర్ విశ్వనాథ్, దొడ్డనగౌడ పాటిల్, డాక్టర్ భరత్ శెట్టి, డాక్టర్ చంద్రు లమాణి, బసవరాజ్ మట్టిముడు, శైలేంద్ర, యశ్‌పాల్ సువర్ణ, తదితరులు ఉన్నారు.

కర్ణాటక శాసనసభ ప్రవర్తన నియమావళిలోని 388 రూల్ ప్రకారం ఆయా ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ విధిస్తూ తీర్మానం చేశారు. కాగా, కర్ణాటక బడ్జెట్‌పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందన తరువాత దీన్ని బీజేపీ సభ్యులు ‘హలాల్ బడ్జెట్’గా అభివర్ణించారు. హనీ ట్రాప్‌ని గాలికి వదిలేసి ముస్లిం కోటా బిల్లుకు ఆమోదం తెలిపారని అన్నారు. బీజేపీ సభ్యులపై సిద్ధరామయ్య మండిపడ్డారు.

కేసు నమోదై విచారణ ప్రారంభిస్తే హనీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి కేఎన్‌ రాజన్న అసెంబ్లీలో ఇటీవల మాట్లాడుతూ.. హనీ ట్రాప్ బాధితులు కనీసం 48 మంది ఉన్నారని చెప్పారు. సీడీలతో పాటు పెన్‌డ్రైవ్‌లలో వారికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని తెలిపారు.