Assembly Elections 2023: రాజస్థాన్‭లో ఆచారం మారలేదు.. ఇదే కంటిన్యూ అయితే కాంగ్రెస్‭ పని అయిపోయినట్టే

గుర్మీత్ సింగ్ కున్నార్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన తుది శ్వాస విడిచారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు

Assembly Elections 2023: రాజస్థాన్‭లో ఆచారం మారలేదు.. ఇదే కంటిన్యూ అయితే కాంగ్రెస్‭ పని అయిపోయినట్టే

Rajasthan Polls: ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధమైన రాజకీయ ఆచారాలు ఉంటాయి. అలాగే రాజస్థాన్ రాష్ట్రానికి ఒక ఆచారం ఉంది. గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో పూర్తి స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగడం లేదు. అంటే, 200 స్థానాలున్న రాజస్థాన్ లో 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతీసారి ఏదో ఒక నియోజకవర్గంలో ఎన్నిక ఆగిపోతోంది. ఈ ఏడాది కూడా 199 నియోజకవర్గాలకే ఎన్నిక జరుగుతోంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇక్కడ ఇదే సంప్రదాయం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇక దీనితో పాటు రాజస్థానీలకు ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. అదేంటంటే.. ప్రతి ఐదేళ్లకు వారు ప్రభుత్వాన్ని మార్చేస్తుంటారు. ఒకవేళ ఈ సంప్రయదాయం కూడా ఈసారి రిపీట్ అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం కోల్పోతుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక మొదటి విషయానికి వస్తే.. శ్రీగంగానగర్ జిల్లా కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కున్నార్ కన్నుమూశారు. దీంతో అక్కడ ఓటింగ్ వాయిదా పడింది. దీంతో వరుసగా మూడోసారి 199 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. 2013, 2018లో ఇలాగే జరిగింది. ఈ ఘటనపై రాజస్థాన్‌లో చర్చ జోరందుకుంది.

ఇది కూడా చదవండి: జమ్మూ కశ్మీర్ లో ఘోర బస్సు ప్రమాదం

గుర్మీత్ సింగ్ కున్నార్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన తుది శ్వాస విడిచారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. వాస్తవానికి ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 45,000 ఓట్లు సాధించారు. ఇక భారతీయ జనతా పార్టీకి 44,000 ఓట్లు వచ్చాయి. సురేంద్ర పాల్ సింగ్ ఇక్కడ బీజేపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు పోరు వీరిద్దరి మధ్యే సాగుతోంది.

2013లో చురు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి జగదీష్ మేఘ్వాల్ మరణించారు. ఎన్నికల తర్వాత ఓటింగ్ జరిగింది. 2018లో అల్వార్‌లోని రామ్‌గఢ్ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ మృతి చెందడంతో ఈ స్థానానికి ఓటింగ్ జరగలేదు. అయితే ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత కున్నార్ కన్నుమూశారు. దీంతో ఈ సీటు సమీకరణాలు మారడం మొదలుపెట్టాయి.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా మద్దతు