Militant Attack : ఉత్తర కశ్మీర్‌లో ఉగ్రదాడి : ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్‌లో పోలీసులపై ఉగ్రదాడి జరిగింది. బందిపొరా జిల్లా గుల్షన్ చౌక్ ప్రాంతంలో ఈ ఉగ్రదాడి జరిగింది.

Militant Attack : ఉత్తర కశ్మీర్‌లో ఉగ్రదాడి : ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు

2 Armed Forces Personnel Injured In Militant Attack In North Kashmir, Says Police

Updated On : December 10, 2021 / 6:09 PM IST

Militant Attack :  జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్‌లో పోలీసులపై ఉగ్రదాడి జరిగింది. బందిపొరా జిల్లా గుల్షన్ చౌక్ ప్రాంతంలో ఈ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసులు ముహమ్మద్ సుల్తాన్ (Muhammad Sultan), ఫయాజ్ అహ్మద్ (Fayaz Ahmad)లకు తీవ్ర గాయాలయ్యాయి.

వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు అధికారి ఒకరు వెల్లడించారు. ఉగ్రదాడి అనంతరం ఘటన జరిగిన ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు.


కశ్మీర్‌లోని బందిపొరాలో జరిగిన ఉగ్రదాడిని మాజీ జమ్ముకశ్మీర్ మంత్రి, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడిన పోలీసులు కోలుకోవాలని, ఈ పరిస్థితుల్లో వారి కుటుంబానికి స్థైర్యాన్ని ప్రసాదించాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.

Read Also : Elon Musk : ఆ బాధ్యతలకు ఇక సెలవు.. ఎలన్ మస్క్ షాకింగ్ ట్వీట్..!