మంత్రిగారు.. రూ.3 కోట్లు ఇవ్వండి : అమిత్ షా ఇంటి నుంచి ఫోన్

హర్యానాలో కలకలం చెలరేగింది. కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరు వాడుకున్నారు. హర్యానా మంత్రికి ఫోన్ చేశారు. బీజేపీకి విరాళంగా రూ.3 కోట్లు

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 02:07 AM IST
మంత్రిగారు.. రూ.3 కోట్లు ఇవ్వండి : అమిత్ షా ఇంటి నుంచి ఫోన్

Updated On : December 30, 2019 / 2:07 AM IST

హర్యానాలో కలకలం చెలరేగింది. కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరు వాడుకున్నారు. హర్యానా మంత్రికి ఫోన్ చేశారు. బీజేపీకి విరాళంగా రూ.3 కోట్లు

హర్యానాలో కలకలం చెలరేగింది. కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరు వాడుకున్నారు. హర్యానా మంత్రికి ఫోన్ చేశారు. బీజేపీకి విరాళంగా రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటి నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి హర్యానా మంత్రి నుంచి రూ.3కోట్లు డిమాండ్ చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు యువకులను జగ్తార్ సింగ్, ఉపకార్ సింగ్‌లుగా గుర్తించారు. హర్యానా విద్యుత్ శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలాకు ఆ ఇద్దరు ఫోన్ చేశారు. మేము అమిత్ షా నివాసం నుంచి మాట్లాడుతున్నాము. పార్టీ విరాళం కింద రూ.3కోట్లు ఇవ్వాండని కోరారు. ఎక్కడో అనుమానం వచ్చిన మంత్రి చౌతాలా.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో హర్యానా భవన్‌లో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

విచారణలో నిందితులు నేరం అంగీకరించారు. ఒపెరా బ్రౌజర్‌ను ఉపయోగించి ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి.. దాని నుంచి మంత్రి చౌతాలాకు ఫోన్ చేసినట్టు చెప్పారు. ఆ యాప్‌ను భారత్‌లో నిషేధించినట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు సిర్సాలో లెదర్ షాపు నిర్వహిస్తుండగా, మరో నిందితుడు చంఢీఘడ్‌లో ట్యాక్సీ నడుపుతున్నాడు.

కొన్ని నెలల క్రితం ఓ భూ వివాదం సెటిల్ మెంట్ విషయంలో వీరికి పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఓ టీవీ సీరియల్‌లో చూసిన సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని మంత్రి చౌతాలకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని పోలీసులు వెల్లడించారు.

* హర్యానా మంత్రికి ఫేక్ ఫోన్ కాల్స్
* అమిత్ షా ఇంటి నుంచి మాట్లాడుతున్నట్టు ఫోన్
* బీజేపీకి విరాళంగా రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్
* ఫోన్ కాల్స్ పై అనుమానంతో పోలీసులకు మంత్రి ఫిర్యాదు
* ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు