Natural Disasters: అస్సాంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా నెల వ్యవధిలో 20 మంది మృతి

ఏప్రిల్ 14 - 17 మధ్య మూడు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 80 రెవెన్యూ సర్కిళ్లలో తీవ్ర తుఫాను మరియు పిడుగు పాటు సంఘటనలు సంభవించాయి

Natural Disasters: అస్సాంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా నెల వ్యవధిలో 20 మంది మృతి

Assam

Updated On : April 18, 2022 / 10:59 AM IST

Natural Disasters: మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ 17 వరకు దాదాపు నెల రోజుల వ్యవధిలో అస్సాం రాష్ట్రంలో సంభవించిన తీవ్ర తుఫానులు మరియు పిడుగుల ధాటికి కనీసం 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జీడీ త్రిపాఠి పేర్కొన్నారు. ఏప్రిల్ 14 – 17 మధ్య మూడు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 80 రెవెన్యూ సర్కిళ్లలో తీవ్ర తుఫాను మరియు పిడుగు పాటు సంఘటనలు సంభవించాయి. వర్షాల ధాటికి ఆయా జిల్లాలోని 1,410 గ్రామాలలో 95,239 మంది పౌరులు నిరాశ్రయులు అయ్యారు. 3,011 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 19,256 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తుఫానులు, పిడుగుపాటు కారణంగా ఈ సీజన్లో మొత్తం 20 మరణాలు సంభవించాయి. వీటిలో ఏప్రిల్ మాసంలోనే 19 మరణాలు సంభవించగా, మార్చి చివరి వారంలో ఒకటి నమోదు అయింది.

Also read:NASA : అది ఏలియన్ పాదముద్రేనా? ఆసక్తికర ఫొటో విడుదల చేసిన నాసా..

తుఫాను బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు గానూ రూపొందించిన నివేదికలో ఈ గణాంకాలు వెల్లడించారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో మొత్తం 1,333 హెక్టార్ల పంట విస్తీర్ణం దెబ్బతిన్నట్లు నివేదించారు అధికారులు. తుఫాను నష్టం అంచనా, తుఫాను బాధితులకు త్వరితగతిన ఆర్థిక సాయం చేరేలా.. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడ్డ సర్కిల్ లెవల్ టాస్క్ ఫోర్స్ అధికారులు..ప్రభుత్వ ఆమోద కోసం నివేదికలోని అంశాలను ద్రువీకరించనున్నారు.

Also Read:Weather Forecast : తెలంగాణలో ఇవాళ, రేపు వానలు

బాధితులకు అందించనున్న ఆర్ధిక సాయం గురించి ప్రభుత్వానికి రిఫర్ చేయకుండానే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) ద్వారా లబ్ధిదారులకు పునరావాస గ్రాంట్లు మొదలైనవాటిని త్వరితగతిన మంజూరు చేయడానికి స్థానిక డిప్యూటీ కమిషనర్లకే ప్రభుత్వం అధికారం అప్పగించింది. అయితే ఈ ఆర్ధిక సాయం చేరవేతలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రత్యక్షంగానూ, వ్యక్తిగతంగానూ బాధితులను పిలిచి ఆర్ధిక సాయం అందించరాదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారుల్లో నిర్లక్ష్యధోరణి, అవినీతిని అరికట్టేందుకే ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Also read:Road accidents : నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి