E-Bicycle : ఈ సైకిల్‌పై 10 పైసల ఖర్చుతో కిలోమీటరు ప్రయాణించొచ్చు .. మధ్యప్రదేశ్ కుర్రాడి ఘనత

100 కిలోల బరువుని కూడా మోసే సామర్థ్యం, కేవలం 30 రూపాయలు ఖర్చు పెడితే 30 కిలోమీటర్లు దూసుకుపోయే సైకిల్ ఇది.

E-Bicycle : ఈ సైకిల్‌పై 10 పైసల ఖర్చుతో కిలోమీటరు ప్రయాణించొచ్చు .. మధ్యప్రదేశ్ కుర్రాడి ఘనత

E-Bicycle

Updated On : April 20, 2023 / 12:03 PM IST

E-Bicycle : 10 పైసలు ఖర్చు పెడితే కిలోమీటరు ప్రయాణించే సైకిల్ తయారు చేశాడు మధ్యప్రదేశ్ కు చెందిన 20 ఏళ్ల యువకుడు. ఏంటీ ఈరోజుల్లో 10పైసలు ఎక్కడున్నాయి? అసలు కనిపించటమే లేదుగా అని అంటున్నారా? పోని రూపాయల్లోనే చెప్పుకుందాం..మూడు రూపాయలు ఖర్చు పెడితే 30కిలోమీటర్లు ప్రయాణించే సైకిల్ ను తయారు చేసి శెభాష్ అని ప్రశంసలు పొందుతున్నాడు మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌ జిల్లాకు చెందిన ఆదిత్య శివ్‌హరే అనే 20 ఏళ్ల యువకుడు.

E-Bicycle 100 కిలోల బరువుని కూడా మోసే సామర్థ్యం ఉంది అని చెబుతున్నాడు ఆదిత్య.చిన్నప్పటి నుంచి కొత్త కొత్త పరికరాలు తయారు చేయటమంటే ఇష్టపడే ఆదిత్య ఎప్పుడు ఏదోకటి తయారు చేసి స్థానికుల ప్రశంసలు పొందుతుంటాడు. అలా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సైకిల్ ను రూపొందించాడు. E-Bicycle తయారు చేయటనాకి రూ.20వేలు ఖర్చు చేసి నెల రోజులు కష్టపడ్డాడు. కష్టానికి తగిన ప్రతిఫలంగా E-Bicycle కళ్లముందు కనిపించేసరికి ఆదిత్య ఆనందం అంతా ఇంతాకాదు.

E-Bicycle ఒకసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 30 కి.మీ దూరం వరకు ప్రయాణించవచ్చని తెలిపాడు ఆదిత్య. ఈ సైకిలుకు మోటార్ బైక్‌కు ఉండే యాక్స్ లా రేటర్, బ్రేకులు, హారన్, లైట్, మొబైల్ స్టాండ్ లాంటి కొన్ని సౌకర్యాలను పొందుపరిచాడు. తన బ్యాటరీ సైకిలుకు ‘తి-1’ అని పేరు కూడా పెట్టాడు. తన చేతులతో రూపొందించిన E-Bicycle వేసుకుని తిరుగుతుంటే ఆదిత్యా భలే తయారు చేసావురా సైకిల్ ని అని ప్రశంసిస్తున్నారు స్థానికులు,స్నేహితులు, బంధువులు..