జార్ఖాండ్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ కూటమిదే అధికారం!

  • Published By: vamsi ,Published On : December 23, 2019 / 05:28 AM IST
జార్ఖాండ్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ కూటమిదే అధికారం!

Updated On : December 23, 2019 / 5:28 AM IST

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం కూటమి దూసుకుపోతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. మొత్తం 81 స్థానాలకు ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఫలితాల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవ్వగా.. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల సరళి ప్రకారం అధికార బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్- జేఎంఎం కూటమి అంచనాలకు తగ్గట్లుగానే ఆధిక్యం చూపుతుంది.

ఫలితాల సరళి ఇలాగే కొనసాగితే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టు కాంగ్రెస్ కూటమికే అధికారం దక్కవచ్చు. మొత్తం 81 స్థానాలకు గానూ కాంగ్రెస్ కూటమి 42, బీజేపీ 28, జేవీఎం 4, ఏజేఎస్‌యూ 3, ఇతరుల నాలుగు స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్య 42 కాగా, ఫలితాల సరళిబట్టి కాంగ్రెస్ కూటమికే స్పష్టమైన మెజార్టీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 

జంషెడ్‌పూర్‌ ఈస్ట్‌లో సీఎం రఘుబరన్‌దాస్, ఢుంకా, బరిహట్‌లో మాజీ సీఎం హేమంత్ సోరేన్ ఆధిక్యంలో ఉండగా, ధన్వార్‌లో మాజీ సీఎం, జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) నేత బాబూలాల్ మరాండీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.