టైమ్స్ నౌ – VMR సర్వే : ఏపీలో జగన్ – తెలంగాణలో కేసీఆర్

  • Published By: madhu ,Published On : January 31, 2019 / 03:06 AM IST
టైమ్స్ నౌ – VMR సర్వే : ఏపీలో జగన్ – తెలంగాణలో కేసీఆర్

Updated On : January 31, 2019 / 3:06 AM IST

ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి కష్టాలు ఎదురవుతాయా ? అధికారంలో కొద్దిదూరంలో నిలిచిపోనుందా ? ఇతరుల సహాయం తప్పనిసరి అవుతుందా ? అనే డౌట్స్‌కు ఎస్ అనే సమాధానం వస్తుంది. టైమ్స్ నౌ – వీఎంఆర్ సర్వే అంచనా వేసింది. అధికారానికి బీజేపీ కేవలం 20 సీట్ల దూరంలో నిలువనుందని తేల్చింది. ఎన్డీయేకు 252, యూపీఏకి 147, ఇతర పార్టీలకు 144 సీట్లు వస్తాయని పేర్కొంది. 

జనవరి 14-25వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 15, 731 మంది ఓటర్ల నుండి అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపింది. మొత్తం 543 సీట్లలో మెజార్టీ మార్కు 272. ఎన్డీయే 20 సీట్ల దూరంలో నిలుస్తుందని పేర్కొంది. దేశ వ్యాప్తంగా బీజేపీకి 215, కాంగ్రెస్‌కి 96 సీట్లు వస్తాయని…అంచనా వేసింది. 2014 ఎన్నికల్లో ఎన్డీయే 336 సీట్లు కైవసం చేసుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. 

పశ్చిమ బెంగాల్‌లో 42 స్థానాల్లో 32 సీట్లను తృణముల్ కాంగ్రెస్, ఏపీలో మొత్తం 25 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 23 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 స్థానాల్లో టీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 5, బీజేపీ 1, ఎంఐఎం 1 గెలుస్తాయి.  ఒడిశాలో మొత్తం 21 సీట్లలో 13 స్థానాలు బీజేపీ, బీజేడీ 8 సీట్లు.., ఈశాన్య రాష్ట్రాల్లోని 11 సీట్లలో బీజేపీ 09 స్థానాలు గెలుచుకుంటాయని టైమ్స్ నౌ – వీఎంఆర్ సర్వే పేర్కొంది. ఇక యూపీలో మొత్తం 80 స్థానాల్లో ఎస్పీ – బీఎస్పీ కూటమికి 51, ఎన్డీయేకి 27 సీట్లు, కాంగ్రెస్ 02 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చింది. రాజస్థాన్‌లో బీజేపీ 17, 8 సీట్లు కాంగ్రెస్ గెలచుకుంటుందని సర్వే పేర్కొంది.

గుజరాత్‌లో మొత్తం 26 సీట్లలో బీజేపీ 24, కాంగ్రెస్ 2 స్థానాలు.., మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 సీట్లలో బీజేపీ 23, కాంగ్రెస్ 6.., కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 14 సీట్లలో విజయం సాధిస్తాయని తెలిపింది. మహారాష్ట్రలో మొత్తం 48 సీట్లలో ఎన్డీయే 43, యూపీఏ 5 గెలచుకుంటాయని…బీహార్‌లో మొత్తం 40లో ఎన్డీయే 25, యూపీఏ 15 స్థానాల్లో గెలుస్తాయని అంచనా వేసింది. మరి టైమ్స్ నౌ – వీఎంఆర్ సర్వే అంచనా నిజమా ? కాదా ? అంటే ఎన్నికలు అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.