మహారాష్ట్రలో ఒక్కరోజే 23,179 కరోనా కేసులు,84మరణాలు
మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం(మార్చి-17,2021) రాష్ట్రవ్యాప్తంగా 23,719కొత్త కరోనా కేసులు,84కోవిడ్ మరణాలు నమోదైనట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం నమోదైన కేసుల కన్నా ఇది దాదాపు 30శాతం అధికమని తెలిపింది.

Maharashtra Corona
23,179 New మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం(మార్చి-17,2021) రాష్ట్రవ్యాప్తంగా 23,179కొత్త కరోనా కేసులు,84కోవిడ్ మరణాలు నమోదైనట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం నమోదైన కేసుల కన్నా ఇది దాదాపు 30శాతం అధికమని తెలిపింది. ఒక్క ముంబైలోనే బుధవారం 2,377కొత్త కేసులు,8మరణాలు నమోదయ్యాయి మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 23,70,507గా ఉంది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SPO)పాటించని అన్ని ప్రైవేటు సంస్థలను కరోనా మహమ్మారి కొనసాగినంతకాలం మూసివేస్తామని ఆ నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది. ప్రైవేటు కేంద్రాలు.. థియేటర్లు,రెస్టారెంట్లు,మాల్స్,వెడ్డింగ్ హాల్స్,ప్రైవేటు ఆఫీసులు వంటివి తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సృష్టం చేసింది. రెస్టారెంట్లు,మల్టీఫ్లెక్సులు 50శాతం సీటింగ్ సామర్థ్యంతో నిర్వహించబడాలని,నిర్దేశించినదానికన్నా ఎక్కువసంఖ్యలో ప్రజలను అనుమతిస్తే అది నిబంధనలు ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. మార్చి-31వరకు ఈ నోటిఫికేషన్ అమలులో ఉంటుందని తెలిపింది. ఇక, దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కరోనా కేసుల్లో 60శాతం ఒక్క మహారాష్ట్రలో ఉన్నట్లు కేంద్రఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనాతో కొత్తగా సంభవిస్తున్న మరణాల్లో 45.4శాతం మహారాష్ట్ర నుంచే ఉన్నట్లు తెలిపింది.
మరోవైపు,కరోనా విజృంభణ నేపథ్యంలో బుధవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వర్చువల్ గా సమావేశమయ్యారు. కొవిడ్‌పై పోరులో భారత్ ఓ గొప్ప ఉదాహరణగా నిలిచినా..ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు ప్రధాని. మన విశ్వాసం..అతివిశ్వాసం కారాదు అని స్పష్టం చేశారు. పరిస్థితిని ఇప్పుడే అదుపు చేయకపోతే… మరోమారు దేశవ్యాప్తంగా కరోనా విజృంభించే ప్రమాదం పొంచి ఉందని ప్రధాని తెలిపారు. దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేశారు. దీనికోసం నిర్ణయాత్మక అడుగులు వేయాలని చెప్పారు. ప్రభావవంతమైన కాంటాక్ట్ ట్రేసింగ్,సూక్ష్మ కంటైన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టాలని సీఎంలకు ప్రధాని సూచించారు. చిన్న పట్టణాల్లో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని సూచించారు. గ్రామాల్లో వైరస్ విస్తరించకుండా జాగ్రత్త పడాలన్నారు.