North East Superfast Trian : రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ ట్రైన్ బోగీలు
రైలు ఆనంద్ విహార్ నుంచి కామాఖ్యకు వెళ్తోంది. రఘునాథ్ పుర్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. North East Superfast

North East Superfast Train Derailed (Photo : X)
North East Superfast Train Derailed : బీహార్ రాష్ట్రంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది. 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ రైలు ఢిల్లీ స్టేషన్ లోని ఆనంద్ విహార్ నుంచి గౌహతీలోని కామాఖ్యకు వెళ్తోంది. రఘునాథ్ పుర్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
రైలు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ రైలు ప్రమాదంతో ఇతర మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అసలేం జరిగింది? రైలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రయాణికులు ఎవరైనా గాయపడ్డారా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.