Indian Fishermen Arrest : 37 మంది భారత మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ

మత్స్యకారుల అరెస్టును ఫిషర్ మెన్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల భారత మత్స్యకారులపై శ్రీలంక అధికారులు దాడులు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది.

Indian Fishermen Arrest : 37 మంది భారత మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ

Indian Fishermen Arrest

Updated On : October 30, 2023 / 9:20 AM IST

Indian Fishermen Arrest : భారత్ కు చెందిన 37 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. రామేశ్వరం నుంచి 463 బోట్లు సముద్రంలోకి వెళ్లగా, అందులో 5 బోట్ల వారు తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణతో 37 మందిని శ్రీలంక నావికా దళం అరెస్టు చేసింది. అరెస్టు చేసిన మత్స్యకారులను తదుపరి చర్యల కోసం శ్రీలంకకు తరలించారు.

రామేశ్వరం నుంచి దాదాపు 463 బోట్లు శనివారం సముంద్రంలోకి వెళ్లాయి. చేపల వేటలో నిమగ్నమైన వారిలో కొద్దిమందిని రాత్రి సమయంలో శ్రీలంక నావికా దళం తరిమికొట్టిందని మరియు ఐఎంబీఎల్ ని ఉల్లంఘించినందుకు ఒక జంట అరెస్టు చేసినట్లు సమాచారం.

China : ప్రపంచంలోనే తొలి ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీ

ఐఎంబీఎల్ ని ఉల్లంఘించినందుకు గానూ ఇప్పటివరకు 5 బోట్లలో రామేశ్వరం నుంచి వచ్చిన 37 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు మత్స్యశాఖ అధికారి పేర్కొన్నారు. మత్స్యకారులందరూ రామేశ్వరం, పాంబన్, తంగచిమడం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.

మత్స్యకారుల అరెస్టును ఫిషర్ మెన్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల భారత మత్స్యకారులపై శ్రీలంక అధికారులు దాడులు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.