ఇంట్లో కూర్చొని పరీక్ష రాశారు.. 39మంది అరెస్ట్

ఇంట్లో కూర్చొని పరీక్షలు రాసిన 39మంది విద్యార్ధులను అరెస్ట్ చేశారు పోలీసులు. కర్నాటకలోని రాయచూర్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుల్‌బర్గా యూనివర్శిటీకి సంబంధించిన బి.కామ్ సెకెండ్ సెమిస్టర్‌లోని ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ పేపర్‌ను ఓ ఇంట్లో కూర్చొని రాశారు విద్యార్ధులు. ఇంట్లో పరీక్షలను నిర్వహిస్తున్న పవన్ కుమార్, హనుమంతప్ప అనే ఇద్దరు వ్యక్తులతోపాటు పరిక్షలు రాస్తున్న విద్యార్ధులను అరెస్ట్ చేశారు పోలీసులు.
గుర్తింపు పొందిన సెంటర్‌లోనే పరీక్షలు జరిగినప్పటికీ, ఈ విద్యార్ధులు మాత్రం పక్కనే అద్దెకు తీసుకున్న భవనంలో గదిలో తాళాలు వేసుకుని పరిక్షలు రాస్తుండగా.. అక్కడకు వచ్చిన పోలీసులు బలవంతంగా డోర్ ఓపెన్ చేయగా అందులో విద్యార్ధులు కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. విషయం మీడియా ద్వారా తెలుసుకున్న గుల్‌బర్గా యూనివర్శిటీ రిజిస్ట్రార్ డీఎమ్ మడారి సెంటర్ వద్దకు చేరుకుని ఆ సెంటర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు వెల్లడించారు. అలాగే అందులో ప్రమేయం ఉన్న విద్యార్ధులపై నిషేధం విధించినట్లు తెలిపారు.