బాబోయ్..క్వారంటైన్ లో బకాసురుడు..10మంది ఫుడ్ ఒక్కడే తినేస్తున్నాడు

  • Published By: nagamani ,Published On : May 29, 2020 / 07:34 AM IST
బాబోయ్..క్వారంటైన్ లో బకాసురుడు..10మంది ఫుడ్ ఒక్కడే తినేస్తున్నాడు

Updated On : May 29, 2020 / 7:34 AM IST

బీహార్‌లోని బక్సర్‌ క్వారంటైన్ సెంటర్‌లో ఆహారానికి కొరత వచ్చింది.కొంతమంది ఆకలితోనే ఉండాల్సి వస్తోంది.  ప్రతీరోజు అక్కడ ఉండేవారికి సరిపడా ఫుడ్ పంపిస్తున్నా సరిపోవట్లేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు సిబ్బందిని ప్రశ్నించారు.దానికి వాళ్లు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు. 

ఆ క్వారంటైన్ సెంటర్‌కు వస్తున్న రోటీలు..అన్నం..కూరలు అంతా ఒకే వ్యక్తి తినేస్తున్నాడని తెలిసి అధికారులు నమ్మలేదు. దీంతో అధికారులు ఆ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లి పరిశీలించగా సదరు బకాసరుడు తినే తిండి చూసిన అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. 23 ఏళ్ల యువకుడు తింటున్న తిండిని చూసి నోరెళ్లబెట్టారు.

రాజస్థాన్‌లోని మంజ్వారీ ప్రాంతం నుంచి బీహార్‌కు వచ్చిన 23 ఏళ్ల అనూప్ ఓజాను నిబంధనల ప్రకారం కరోనా అనుమానంతో అధికారులు క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అతను వచ్చినప్పటి నుంచి ఆ క్వారంటైన్ సెంటర్‌లో తిండి కష్టాలు మొదలయ్యాయి.

అనూప్ ఒక్కడే పది మందికి సరిపడా తిండి తినేస్తున్నాడు. పొద్దు పొద్దునే ఫుల్ ఆకలితో వచ్చే అనూప్  కేవలం బ్రేక్ ఫాస్ట్ గా  40 రోటీలతో పాటు ఓ పేద్ద ప్లేటుతో కూర తినేస్తున్నాడు. 
ఇక లంచ్, డిన్నర్‌ పరిస్థితి చెప్పనే అక్కర్లేదు..ఏకంగా పది ప్లేట్ల రైస్..కూరలు లాగించేస్తున్నాడు. దీంతో ఆ క్వారంటైన్ సెంటర్లో ఉన్నవారందరికీ సరిపడా తింటి అనూప్ ఒక్కడికే సరిపోతోంది. దీంతో మిగిలినవారికి తిండి కొరత ఏర్పడింది. ఆ సెంటర్ లో తక్కువ మందే ఉన్నా..అంత ఆహారం ఎందుకు డిమాండ్ చేస్తున్నారని అధికారులు ప్రశ్నించగా ఈ విషయం బయటపడింది. వంటవాళ్లు కూడా అతడికి అంత ఆహారాన్ని చేసి ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నారని తెలియడంతో ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగారు.

దీనిపై బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బీడీవో) ఏకే సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల వలస కూలీల కోసం బీహార్‌ ప్రత్యేక వంటకమైన ‘లిట్టీ’ని ఏర్పాటుచేశాం. అనూప్ ఒక్కడే 85 లిట్టీలు తినటం చూసి ఆశ్చర్యపోయామన్నారు.
ఆ సెంటర్‌లో వంటగాళ్లు ఈ ఒక్కడి కోసమే అన్నేసి రోటీలు తయారు చేసి చేసీ అలసిపోతున్నారు. కానీ పొట్టపట్టినంత తింటాడు..అలా అని అతన్ని ఆకలితో ఉంచలేం కదాని..అనూప్ క్వారంటైన్ సెంటర్ లో ఉన్నంతకాలం ఎంత ఫుడ్ అడిగా పెట్టమని ఎవ్వరూ ఎటువంటి అభ్యంతరాలు చెప్పవద్దని చెప్పామన్నారు. త్వరలోనే అతడి క్వారంటైన్ సమయం కూడా ముగుస్తుంది’’ అని తెలిపారు. ప్రస్తుతం బీహార్‌లో 3,061 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 15 మంది చనిపోయారు. వెయ్యి మందికి పైగా బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.

Read: ఏడాదిలో ఆ 5రోజులు స్త్రీలు బట్టలు వేసుకోరు..మంచుకొండల గ్రామంలో వింత ఆచారం