ఆరోదశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2019 / 02:54 PM IST
ఆరోదశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

Updated On : May 11, 2019 / 2:54 PM IST

ఆరోదశ ఎన్నికల పోలింగ్ కు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఆదివారం(మే-11,2019) ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జార్ఖండ్ లోని 4లోక్ సభ స్థానాలకు ఆరో దశలో భాగంగా ఆదివారం పోలింగ్ జరగనుంది.ఆదివారం పోలింగ్ జరగనున్న స్థానాల్లో కొన్ని మావోయిస్టుల ప్రభావం ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయని,అయినా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఓ సీనియర్ ఎలక్షన్ కమిషన్ అధికారి తెలిపారు. నాలుగు,ఐదో దశ పోలింగ్ సందర్భంగా బెంగాల్ లొో హింసాత్మక ఘటనలు చోటు చసుకోవడంతో ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా 15,428 బూత్ లలో కేంద్రబలగాలను రంగంలోకి దించేందుకు ఎలక్షన్ కమిషన్ రెడీ అయింది.

కేంద్రమంత్రులు రాధామోహన్ సింగ్,హర్షవర్ధన్,మేనకాగాంధీ,నరేంద్రసింగ్ తోమర్,క్రిషన్ పాల్ గుర్జర్,రావ్ ఇంద్రజిత్ సింగ్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ప్రగ్యా సింగ్ ఠాకూర్, ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ,గౌతం గంభీర్,షీలా దీక్షిత్,బాక్సర్ విజేందర్ సింగ్ లు ఆరోదశ బరిలో ప్రముఖులుగా ఉన్నారు. ఉదయం 7గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగుస్తుంది. మే-19,2019న జరుగబోయే ఏడో దశ పోలింగ్ తో సార్వత్రిక ఎన్నికలు ముగుస్తాయి.మే-23,2019న ఫలితాలు వెలువడతాయి.