తాజ్ హోటల్ ఉద్యోగుల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.. ఇప్పటికే 1574 మందికి కరోనా సోకగా, 110 మంది వరకు మృతిచెందారు.

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.. ఇప్పటికే 1574 మందికి కరోనా సోకగా, 110 మంది వరకు మృతిచెందారు.
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.. ఇప్పటికే 1574 మందికి కరోనా సోకగా, 110 మంది వరకు మృతిచెందారు. ఇఫ్పుడు తాజాగా ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. నగరంలో ప్రసిద్ధిచెందిన తాజ్ మహాల్ ప్యాలెస్, దక్షిణ ముంబైలోని కొలంబాలో ఉన్న తాజ్ మహాల్ టవర్స్ హోటల్ పనిచేసే ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించినట్టు ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు ఒకరు వెల్లడించారు.
ఇండియన్ హోటెల్స్ కంపెనీ (IHC) తాజ్ హోటల్ నిర్వహించే హోటల్లో ఒక్కటి. తమ హోటళ్లలో పనిచేసే ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్టు కంపెనీ ధ్రువీకరించింది. కానీ, ఎంతమందికి వైరస్ సోకిందో కచ్చితమైన సంఖ్యను రివీల్ చేయలేదు. వివిధ రాష్ట్రాల్లోని ఆస్పత్రుల నుంచి కరోనా బాధితులకు చికిత్స అందించే ఆరోగ్య కార్యకర్తలు, వైద్యుల కోసం ఈ కంపెనీ నిర్వహిస్తోంది. నగరంలోని తన హోటల్ నుంచి కూడా ఇతర ఎమర్జెన్సీ సర్వీసులను అందిస్తోంది.
కొలంబాలోని తాజ్ ప్యాలెస్ మాత్రమే కాకుండా బండ్రాలోని తాజ్ ల్యాండ్ ఎండ్, కఫ్పీ పరేడ్ లోని వివంటా ప్రెసిడెంట్, తాజ్ శాంటాక్రజ్ లను కూడా IHC నిర్వహిస్తోంది. ప్రస్తుతం.. వైరస్ సోకిన ఆరుగురు ఉద్యోగులు బాంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది… నెమ్మదిగా కోలుకుంటున్నారని డాక్టర్ గౌతమ్ భన్సాలీ తెలిపారు.