మంచు బీభత్సం : ఆరుగురు ఐటీబీపీ జవాన్లు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : February 20, 2019 / 03:24 PM IST
మంచు బీభత్సం : ఆరుగురు ఐటీబీపీ జవాన్లు మృతి

Updated On : February 20, 2019 / 3:24 PM IST

మంచుచరియలు విరిగిపడటంతో  ఐటీబీపీకి చెందిన ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు జవాన్లు మంచు చరియల కింద కూరుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలోని నంగ్య ప్రాంతంలో బుధవారం(ఫిబ్రవరి-20,2019) మధ్యాహ్నా సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ఐటీబీపీ, స్థానిక జిల్లా పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు.

ఇప్పటివరకు ఒక జవాను మృతదేహాన్ని వెలికి తీశామని, మిగిలిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ గోపాల్ చంద్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఛంబ,లాహుల్-స్పిటి,సిమ్లా,కులు జిల్లాల్లో రానున్న రోజుల్లో భారీగా హిమపాతం నమోదయ్యే అవకాశముందని, పలు ప్రాంతాల్లో మంచుచరియలు విరిగిపడే అవకాశముందని అక్కడి అధికారులు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు.