JJ Hospital : జేజే ఆసుపత్రిలో 61 మంది వైద్యులకు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టించింది. ముంబై నగరంలోని జేజే ఆసుపత్రిలో 61మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది

JJ Hospital : జేజే ఆసుపత్రిలో 61 మంది వైద్యులకు కరోనా పాజిటివ్

Jj Hospital

Updated On : January 5, 2022 / 5:56 PM IST

JJ Hospital : మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టించింది. ముంబై నగరంలోని జేజే ఆసుపత్రిలో 61మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఒమిక్రాన్ తోపాటు కరోనా కూడా విజృంభిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో 18,466 కరోనా కేసులు వెలుగు చూశాయి.

చదవండి : Corona Positive : ఇద్దరు డిప్యూటీ సీఎంలతో సహా నలుగురు మంత్రులకు కరోనా

దీంతో యాక్టీవ్ కేసుల సంఖ్య 66,308కి చేరుకుంది. ఓమిక్రాన్ వేరియంట్ కేసులు 653కి పెరిగాయి. ఇక ఇదిలా ఉంటే గోవా నుంచి ముంబై వచ్చిన క్రూయిజ్ షిప్‌లోని 1,827 మందికి పరీక్షలు చేయగా 66 మందికి కరోనా నిర్దారణ అయింది. దీంతో ఐదు అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు అధికారులు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్ సేకరించారు.

చదవండి : Corona Wave: భారతదేశంలో మూడో వేవ్ వచ్చేసింది.. ఢిల్లీకి ఐదవ వేవ్.. భారీగా కోవిడ్ కేసులు!