Moon Surface Temperature : చల్లని చందమామ కాదు.. మండే చంద్రుడే.. తేల్చిచెప్పిన ఇస్రో శాస్త్రవేత్తలు

చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడిన చంద్రయాన్ -3 తన పరిశోధనలు ప్రారంభించింది. మండే సూర్యుడని, చల్లని చందమామ అని మనం అనుకుంటుంటాం. కాని చంద్రుడి ఉపరితలంపై పగలు ఉష్ణోగ్రత 50 నుంచి 70 డిగ్రీల సెల్షియస్ అని ఇస్రో పరిశోధనలో వెల్లడైంది.....

Moon Surface Temperature : చల్లని చందమామ కాదు.. మండే చంద్రుడే.. తేల్చిచెప్పిన ఇస్రో శాస్త్రవేత్తలు

moon surface temperature

Updated On : August 28, 2023 / 10:22 AM IST

70 degree Celsius moon surface temperature : చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడిన చంద్రయాన్ -3 తన పరిశోధనలు ప్రారంభించింది. మండే సూర్యుడని, చల్లని చందమామ అని మనం అనుకుంటుంటాం. కాని చంద్రుడి ఉపరితలంపై పగలు ఉష్ణోగ్రత 50 నుంచి 70 డిగ్రీల సెల్షియస్ అని ఇస్రో పరిశోధనలో వెల్లడైంది. చంద్రుడిపై కాలు మోపిన విక్రమ్ ల్యాండర్ లోని చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్ పెరిమెంట్ పేలోడ్ సేకరించిన అక్కడి ఉష్ణోగ్రతల వివరాలను ఇస్రోకు గ్రాఫ్ రూపంలో పంపించింది. (70 degree Celsius moon surface temperature) చంద్రునిపై చంద్రయాన్ 3 పంపిన ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 70 డిగ్రీలు ఉండటంతో ఇస్రో శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు.

Rozgar Mela : రోజ్‌గార్ మేళాలో 51వేలమంది అభ్యర్థులకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లెటర్లు

చంద్రయాన్ 3 ఆదివారం దక్షిణ ధ్రువంలోని చంద్ర ఉపరితల ఉష్ణోగ్రతపై తన మొదటి పరిశోధనలను పంపింది. చంద్రుని ఉపరితలం సమీపంలో 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘‘చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత ఉపరితలంపై 20-డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 30-డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందని మేమంతా విశ్వసించాం, కానీ అది 70-డిగ్రీల సెంటీగ్రేడ్. ఇది మేం ఊహించిన దానికంటే ఆశ్చర్యకరంగా ఎక్కువగా ఉంది’’ అని ఇస్రో శాస్త్రవేత్త బిహెచ్ దారుకేషా వెల్లడించారు.

Moon a Hindu Rashtra : చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించండి : హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి డిమాండ్

చంద్రుని నేల ఉష్ణోగ్రత గురించి చంద్రయాన్ 3 మొదటి అన్వేషణ శాస్త్రవేత్తలకు కళ్ళు తెరిపించింది. చంద్రయాన్ 3 యొక్క మొదటి అన్వేషణ చాలా ఆసక్తికరంగా ఉంది. ‘‘మనం భూమి లోపలికి రెండు నుంచి మూడు సెంటీమీటర్లు వెళ్లినప్పుడు, మనకు రెండు నుంచి మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ వైవిధ్యం కనిపించదు, అయితే చంద్రుడిలో ఇది దాదాపు 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వైవిధ్యంగా ఉందని, ఇది ఆసక్తికర విషయమని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. చంద్రయాన్ 3 డేటా ఆధారంగా చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రతపై గ్రాఫ్ ఇస్రో ట్వీట్ చేసింది.