పీవీ సింధూతో పెళ్లి చేయండి.. లేకుంటే కిడ్నాప్ చేస్తా: ఏకంగా కలెక్టర్ నే అడిగేశాడు

  • Published By: vamsi ,Published On : September 17, 2019 / 11:44 AM IST
పీవీ సింధూతో పెళ్లి చేయండి.. లేకుంటే కిడ్నాప్ చేస్తా: ఏకంగా కలెక్టర్ నే అడిగేశాడు

Updated On : September 17, 2019 / 11:44 AM IST

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధుతో పెళ్లి చేయండంటూ ఏకంగా కటెక్టర్ కే అర్జీ పెట్టుకున్నాడు ఓ 70 ఏళ్ల వ్యక‍్తి. నా వయస్సు 16ఏళ్లు.. నాకు పీవీ సింధూ అంటే చాలా ఇష్టం ఆమెతో నాకు పెళ్లి చేయండి అంటూ అర్జీ పెట్టుకున్నాడు తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే వృద్ధుడు. సింధూని పెళ్లి చేసుకునేందుకు ఆమె తల్లిదండ్రులను ఒప్పించాలని. పెళ్లికి ఏర్పాట్లు చేయాలని, అలా చేయకుంటే పీవీ సింధూని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటానని తన అర్జీలో చెప్పుకొచ్చాడు.

సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మలైస్వామి, తన కోరికను సమస్యగా కలెక్టర్ కు లిఖిత పూర్వకంగా అర్జీ పెట్టుకున్నాడు. పీవీ సింధూ ఆటతీరు తనను ఎంతో ఆకట్టుకుందని, ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని చెబుతూ.. సింధు, మలైస్వామి ఫోటోలను జతచేసి కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు. అయితే ఆ పిటిషన్‌లో మలైస్వామి 2004 ఏప్రిల్‌ 4న పుట్టానని వెల్లడించాడు. ఈ వింత అభ్యర్థనపై కలెక్టర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మలైస్వామి మానసిక పరిస్థితిపై అక్కడివారిని ఆరా తీశారు. అయితే మలైస్వామి మాత్రం సింధుతో తన పెళ్లి చేయాల్సిందే అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు.