తారల సందడి: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2019 ప్రారంభం

ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్‌గా చెప్పుకునే కేన్స్ వేడుక మంగళవారం (మే 15, 2019) సాయంత్రం ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలెంట్ ఆర్టిస్ట్‌లు అందరూ ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఈ వేడుకను పదకొండు రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుతారు.
అంతేకాదు కేన్స్ వేడుక ‘The Dead Don’t Die’ సినిమా ప్రీమియర్ షోతో ప్రారంభం కాగా ఈ కార్యక్రమానికి ఎల్లే ఫాన్నింగ్, టిల్డా స్విన్టన్, సెలెనా గోమెజ్, జులియానా మూరే హాజరయ్యారు. 72వ అంతర్జాతీయ కేన్స్ చలన చిత్రోత్సవ వేడుక ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ రివేరా నదీ తీరాన ఉన్న కేన్స్ ప్రాంతంలో జరుగుతున్న ఈ వేడుకకి ఇండియన్ సెలబ్రిటీలు దీపికా పదుకొణే, ఐశ్వర్యరాయ్ బచ్చన్, సోనమ్ కపూర్, కంగనా రనౌత్, డైనా పెంటి, మల్లికా షెరావత్, హీనా ఖాన్ తదితరులు హాజరు కానున్నారు.