8, 7, 6.6, 5.8, 5, 4.5= దేశ ఆర్థికస్థితి : చిదంబరం

INX మీడియా కేసులో తీహార్ జైలు నుంచి విడుదలైన కేంద్ర మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం ఇవాళ(డిసెంబర్-5,2019) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ ఆర్థికస్థితిపై ఆయన మాట్లాడుతూ మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడు మాట్లాడరని చిదంబరం విమర్శించారు.
మోడీ ప్రభుత్వం చాలా తప్పులు చేస్తుందన్నారు. ఇది చాలా తప్పు అన్నారు. ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చిందన్నారు. ఉల్లి ధరలు పెరిగినా ఈ ప్రభుత్వానికి పట్టదు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు.. వాటి గురించి పట్టించుకోరు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు అని చిదంబరం అన్నారు. గత ఆరు క్వార్టర్ల జీడీపీ గ్రోత్ రేటు సంఖ్య 8,7,6.6,5.8,5,4.5ను ప్రస్తావిస్తూ ఇదే ఆర్థికవ్యవస్థ స్థితి అంటూ వ్యంగ్యంగా మోడీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ గురించి తెలియడంలేదన్నారు. 106 రోజుల అనంతరం నిన్న రాత్రి 8 గంటలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నానని చిదంబరం అన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చిదంబరం పేర్కొన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో తాను ఏం చేశానో అందరికి తెలుసునన్నారు.
అంతకుముందు పార్లమెంట్ కు వెళ్లిన చిదంబరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ…పార్లమెంట్ లో తన వాయిస్ ను ప్రభుత్వం అణచలేదన్నారు. ఉల్లి ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన ఆందోళనలో కూడా చిదంబరం పాల్గొన్నారు