heart-touching story : నాల్గవ లడ్డూ నేను ఎప్పటికీ తీసుకోలేను.. డాక్టర్ షేర్ చేసిన పోస్ట్.. నాల్గవ లడ్డూ ఏంటి?
ఓ పేషెంట్ తాలూకు భార్య డాక్టర్‌ని కలిసి మూడు లడ్డూలు ఇచ్చింది. నాల్గవ లడ్డూ ఎప్పటికీ నేను వారి నుంచి తీసుకోలేను కదా అని డాక్టర్ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఈ లడ్డూ కథ ఏంటి?.. డాక్టర్ షేర్ చేసిన ఓ దయనీయమైన గాథ అందరి మనసుల్ని కదిలించింది.

Doctor shares heart-touching story
Doctor shares heart-touching story : ఇంటి పెద్దకు ఉన్న మద్యం అలవాటు ఆ కుటుంబాన్ని మనశ్శాంతి లేకుండా చేసింది. భర్త మద్యానికి బానిస అవ్వడం.. వైద్య ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో తన భర్తకు ట్రీట్మెంట్ ఇవ్వొద్దని డాక్టర్లకు విజ్ఞప్తి చేసింది అతని ఇల్లాలు. ఆమె అలా చెప్పడం వెనుక ఉన్న దయనీయమైన గాథను ఆ డాక్టర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
పాల్ అనే వ్యక్తి ఓ చిన్నపాటి బేకరీ నడుపుతున్నాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అతని భార్య కూడా పనికి పోయేది. బేకరి నడపగా వచ్చిన డబ్బంతా పాల్ మద్యానికి వెచ్చించేవాడు. అలా పూర్తిగా దానికి బానిసైపోయి అనారోగ్యం బారిన పడ్డాడు. 15 సంవత్సరాలు అతిగా మద్యం సేవించిన పాల్‌కి కాలేయ మార్పిడి చేయకపోతే ప్రాణం మీదకు వచ్చే పరిస్థితి వచ్చింది.
ఇంటి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం తిప్పుతూ అతని భార్య చాలా ఇబ్బందులు పడింది. అలాంటి పరిస్థితుల్లో విసిగిపోయిన పాల్ భార్య ఓ నిర్ణయానికి వచ్చింది. వైద్యం కోసం ఫోన్‌లో సంప్రదించిన వైద్యుడికి తన భర్త అనారోగ్యంగా ఉన్నా అలాగే ఉండనివ్వండని చెప్పేసింది. ఫోన్‌లో మందులు రాసిన డాక్టర్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పాడు. పాల్ ప్రాణాలు దక్కలేదు.
పాల్ మరణించిన కొన్ని వారాల తర్వాత అతని భార్య డాక్టర్ తన భర్త పుట్టినరోజు గుర్తు చేస్తూ మూడు లడ్డూలు తీసుకువెళ్లి ఇచ్చింది. అందులో ఒకటి ఆమె నుండి.. మిగిలిన రెండు ఇద్దరు కుమార్తెల నుండి. డాక్టర్ నాల్గవ లడ్డూ ఇంక ఎప్పుడూ స్వీకరించలేనని డాక్టర్ ఎమోషనల్ అయ్యారు.
ఆ నాల్గవ లడ్డూ పాల్ నుంచి.. పాల్ భార్య దుకాణం నడుపుతోంది. అతని ఇద్దరు పిల్లలు స్కూల్ కి వెళ్లి చదువుకుంటున్నారు. కానీ పాల్ చేతులారా చేసుకున్న మద్యం అలవాటు అతని జీవితాన్ని నాశనం చేసింది. ఈ విషయాన్ని Dr Abby Philips aka TheLiverDoc (@theliverdr) అనే ట్విట్టర్ యూజర్ అంటే పాల్‌కి వైద్యం అందించిన డాక్టర్ స్వయంగా పోస్టు పెట్టారు. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి వల్ల అతని కుటుంబం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కుందో చెబుతూ ఆ వైద్యుడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
డాక్టర్ యొక్క సుదీర్ఘ ట్విట్టర్ పోస్ట్ నెటిజన్ల మనసుల్ని కదిలించింది. పాల్ కుటుంబసభ్యుల్ని కలవాలని ఉందని.. ఇలాంటి పోస్ట్ ల ద్వారా మద్యం తాగేవారిలో మార్పు రావొచ్చని..అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజమే పాల్ తనకున్న బ్యాడ్ హ్యాబిట్ వల్ల తన ప్రాణాలను కోల్పోవడంతో పాటు.. తన కుటుంబానికి దిక్కులేకుండా చేశాడు. ఇలాంటి స్టోరీలు తెలిస్తే మరికొందరిలో అయినా మార్పు రావాలనే ఉద్దేశంతో డాక్టర్ రాసిన పోస్ట్ ఆలోచింపచేస్తోంది.
The 4th Laddu.
These 3 laddus were given to me by the wife of my patient on his birthday, a few weeks before.
She was now happy and the family was doing good for themselves.
My patient Paul, suffered from alcohol use disorder. He had been drinking for more than 15y. Three… pic.twitter.com/wLjMyuXhNZ
— TheLiverDoc (@theliverdr) May 1, 2023