Zika Virus In Karnataka : కర్ణాటకలో జికా వైరస్ తొలి కేసు.. ఐదేళ్ల చిన్నారిలో గుర్తింపు

కర్ణాటకలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో తొలి కేసు నమోదు అయింది. ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు తేలింది.

Zika Virus In Karnataka : కర్ణాటకలో జికా వైరస్ తొలి కేసు.. ఐదేళ్ల చిన్నారిలో గుర్తింపు

Zika virus

Updated On : December 13, 2022 / 9:02 AM IST

Zika Virus In Karnataka : కర్ణాటకలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో తొలి కేసు నమోదు అయింది. ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు తేలింది. డెంగ్యూ, చికున్ గున్యా లక్షణాలు ఉన్నాయనే అనమానంతో (డిసెంబర్ 5,2022)న ముగ్గురు పేషెంట్ల నుంచి సీరమ్ శాంపిల్స్ సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు.

ఇటీవల పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి. మూడు శాంపిల్స్ రెండు నెగెటివ్ రాగా, మరొకటి పాజిటివ్ గా వచ్చింది. ఐదేళ్ల చిన్నారిలో జికా వైరస్ ఉన్నట్లు బయటపడింది.

Zika Virus Pune : మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం.. వృద్ధుడిలో గుర్తింపు

కర్ణాటకలో ఇదే తొలి జికా కేసు అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.