Marriage Cancel : షాంపూ కారణంగా పెళ్లి రద్దు

ఓ షాంపూ పెళ్లినే రద్దు చేసింది. ఒక్క షాంపూ వల్ల పెళ్లి ఎలా ఆగిపోయిందనుకుంటున్నారా? వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. ఈ విచిత్ర ఘటన అసోంలోని గువాహటిలో చోటు చేసుకుంది.

Marriage Cancel : షాంపూ కారణంగా పెళ్లి రద్దు

marriage canceled

Updated On : December 18, 2022 / 4:12 PM IST

Shampoo Marriage Cancel : ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేసింది అన్నట్లుగా ఓ షాంపూ పెళ్లినే రద్దు చేసింది. ఒక్క షాంపూ వల్ల పెళ్లి ఎలా ఆగిపోయిందనుకుంటున్నారా? వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. ఈ విచిత్ర ఘటన అసోంలోని గువాహటిలో చోటు చేసుకుంది. పెళ్లి వేడుకల్లో భాగంగా వధువు ఇంటికి వరుడు పంపిన కొన్ని వస్తువుల్లో షాంపూ కూడా ఉంది.

అయితే ఆ షాంపూకు అతి తక్కువ ధర ఉండటంతో వరుడిని వధువు నిలదీసింది. దీంతో వరుడు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నాడు. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. గువాహటికి చెందిన ఓ ఇంజినీర్ తో యువతికి వివాహం నిశ్చయమైంది. అయితే ఈనెల 14న వారి పెళ్లి జరగాల్సివుంది.

Bride refuses to marry: మద్యం తాగిన వరుడు.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు

ఈ క్రమంలో వరుడి కుటుంబ సభ్యులు పెళ్లికి ముందు విలువైన బహుమతులతోపాటు కొన్ని వస్తువులను వధువుకు పంపించారు. అయితే ఆ వస్తువుల్లో షాంపూ కూడా ఉంది.కానీ చాలా తక్కువ రేటు కల్గిన షాంపూ కావడంతో వధువుకు కోపం వచ్చింది.

‘నీ స్థాయి ఇంతేనా’ అంటూ వరుడికి వాట్సాప్ లో మెసేజ్ పంపింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు క్షమాపణలు చెప్పినప్పటికీ వరుడు వినలేదు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.