కేజ్రీవాల్‌ను అడ్డు తొలగించుకోవడానికి బీజేపీ కుట్ర.. అందుకే దాడి: ఢిల్లీ సీఎం అతిశీ
అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేసి, ఆయన కారుపై రాళ్లు రువ్విన వారిపై ఇంతకుముందే కేసులు ఉన్నాయని, వారు తీవ్రనేరాలకు పాల్పడిన వారని అతిశీ అన్నారు.

ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ సీఎం అతిశీ మండిపడ్డారు.
ఇవాళ అతిశీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను అడ్డు తొలగించుకోవడానికి బీజేపీ కుట్రం పన్నిందని అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను బీజేపీ ఓడించలేదని చెప్పారు.
అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేసి, ఆయన కారుపై రాళ్లు రువ్విన వారిపై ఇంతకుముందే కేసులు ఉన్నాయని, వారు తీవ్రనేరాలకు పాల్పడిన వారని అతిశీ అన్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేమని ఆయనను తమ దారి నుంచి తప్పించడానికి బీజేపీ ఇటువంటి వ్యూహాలను రచిస్తోందని చెప్పారు.
దాడి చేసిన వారిలో ఒకరు బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ సహచరుడని అతిశీ ఆరోపించారు. పర్వేశ్ వర్మ ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై పోటీ చేస్తున్నారు. రాహుల్ అలియాస్ శాంకీ అనే ఆ వ్యక్తిపై చోరీ, హత్యాయత్నం వంటి అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని అతిశీ అన్నారు. కే
జ్రీవాల్‌పై దాడి చేయడానికి ఆ నేరస్తుడిని మరికొందరితో పాటు పంపారని అతిశీ తెలిపారు. ఆ నేరస్థుడు ప్రచార కార్యక్రమాల సమయంలో వర్మతో కలిసి తరచూ కనిపిస్తారని ఆమె ఆరోపించారు.
కేంద్ర సహకారంతో వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడ్డాం: సీఎం చంద్రబాబు