అభినందన్‌ది ఏ కులం : గూగుల్‌లో తెగ వెతికేసిన భారతీయులు

శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాన్ని కూల్చేసి వీరుడయ్యాడు. పాక్ సైన్యానికి బందీగా చిక్కినా అదరలేదు బెదరలేదు. పాక్ ఆర్మీ చెర నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.

  • Published By: veegamteam ,Published On : March 2, 2019 / 04:03 PM IST
అభినందన్‌ది ఏ కులం : గూగుల్‌లో తెగ వెతికేసిన భారతీయులు

Updated On : March 2, 2019 / 4:03 PM IST

శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాన్ని కూల్చేసి వీరుడయ్యాడు. పాక్ సైన్యానికి బందీగా చిక్కినా అదరలేదు బెదరలేదు. పాక్ ఆర్మీ చెర నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.

శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాన్ని కూల్చేసి వీరుడయ్యాడు. పాక్ సైన్యానికి బందీగా చిక్కినా అదరలేదు బెదరలేదు. పాక్ ఆర్మీ చెర నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.  శుక్రవారం(మార్చి-1-2019) రాత్రి స్వదేశానికి చేరుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అభినందన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. భారత ఎయిర్స్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. రియల్  హీరో అని యావత్ దేశం కీర్తిస్తోంది. అభి వివరాలు తెలుసుకోవడానికి భారతీయులు ఆసక్తి చూపారు. ముఖ్యంగా అభినందన్ ఏ కులానికి చెందినవాడు అని గూగుల్‌లో తెగ వెతికేశారు.

‘అభినందన్ క్యాస్ట్’ ‘అభినందన్ క్యాస్ట్ జైన్’ ‘ఈజ్ అభినందన్ వర్ధమాన్ జైన్’ ‘వర్ధమాన్ క్యాస్ట్ ఇన్ సౌతిండియా’ అని గుగూల్‌లో సెర్చ్ చేశారు. అభినందన్ వర్ధమాన్ కులం గురించి తెగ వెతికిన  రాష్ట్రంగా గుజరాత్ టాప్ లో నిలిచింది. ఆయన కులం గురించి తెలుసుకునేందుకు గుజరాతీ ప్రజలు చాలా ఆసక్తి చూపారు.  తెలుగు రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఇది  గూగుల్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

గూగుల్‌లో కులం గురించి వెతకడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్ సిల్వర్ మెడల్ సాధించినప్పుడు కూడా జనం ఆమె కులం గురించి గూగుల్‌లో  శోధించారు. అలాగే, ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్ 20 ఛాంపియన్‌షిప్‌లో హిమాదాస్ గోల్డ్ మెడల్ సాధించినప్పుడు కూడా నెటిజన్లు ఆమె కులం గురించి తెలుసుకోవడానికి సెర్చ్ చేశారు.

భారత ఆర్మీ పోస్టులపై దాడికి యత్నించిన పాక్ యుద్ధ విమానాన్ని.. ప్రాణాలను పణంగా పెట్టి అభినందన్ అడ్డుకున్నారు. వాటిని తరిమి కొట్టారు. ఓ విమానాన్ని కూల్చేశారు. ఈ క్రమంలో అభినందన్ ఉన్న మిగ్ 21 యుద్ధ విమానం కూలిపోయింది. అభినందన్ పారాచ్యూట్ ద్వారా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో దిగారు. వెంటనే ఆయనను చుట్టుముట్టిన కొందరు దాడి చేశారు. విచక్షణరహితంగా కొట్టారు. ఆ తర్వాత పాక్ ఆర్మీ అభిని అదుపులోకి తీసుకుంది.

ఆ సమయంలో పాక్ ఆర్మీ విడుదల చేసిన వీడియో అభినందన్‌ని హీరోని చేసింది. పాక్ అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు అభి ఇచ్చిన సమాధానం భారతీయులను ఫిదా చేసింది. తాను దక్షిణ భారతీయుడిని అని మాత్రమే చెప్పిన అభినందన్.. ఆ తర్వాత పాక్ ఆర్మీ అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. శత్రువు చేతిలో బందీగా ఉన్నా ఏ మాత్రం బెదరకుండా అభినందన్ చూపిన ధైర్యసాహసాలకు యావత్ భారతీయులు హ్యాట్సాఫ్ చెప్పారు.