కరోనా “act of god”, జిఎస్టీ బకాయిల్లో రాష్ట్రాలకు 2 ఆప్షన్స్ : నిర్మలా సీతారామన్‌

  • Published By: venkaiahnaidu ,Published On : August 27, 2020 / 08:28 PM IST
కరోనా “act of god”, జిఎస్టీ బకాయిల్లో రాష్ట్రాలకు 2 ఆప్షన్స్ : నిర్మలా సీతారామన్‌

sitharaman-nirmala

Updated On : August 28, 2020 / 12:01 PM IST

Covid “Act Of God”: జీఎస్టీ అమలు వల్ల ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు మార్గాలు ప్రతిపాదించింది. ఇవాళ(ఆగస్టు-27,2020)జరిగిన జీఎస్టీ 41వ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు ప్రభుత్వం ఆలోచనల్ని రాష్ట్రాల ముందుంచారు.

నష్టపరిహారం భర్తీకి ఆర్థిక మంత్రి రాష్ట్రాలకు చేసిన రెండు ప్రతిపాదనలు

.1. జీఎస్​టీ అమలు వల్ల ఏర్పడిన లోటు రూ.97వేల కోట్లను ఆర్​బీఐ నుంచి సరసమైన వడ్డీకి రుణం తీసుకోవడం
.2. మొత్తం రూ.2.35వేల కోట్లను ప్రత్యేక ఏర్పాటు ద్వారా ఆర్​బీఐ నుంచి రుణంగా పొందడం.

జీఎస్టీ కౌన్సిల్ 41 వ సమావేశం తరువాత విలేకరులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… ఆర్థిక వ్యవస్థ సంకోచానికి దారితీసే అసాధారణమైన “దేవుని చట్టం”( “Act of God) పరిస్థితిని ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ. 3 లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందని. అందులో రూ.65 వేల కోట్లు ఆదాయం మాత్రమే వచ్చే అవకాశం ఉందని నిర్మల తెలిపారు.

రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం కోసం రావాల్సిన ఆదాయంలో రూ.2.35 లక్షల కోట్ల లోటు ఏర్పడుతోందని ఆమె తెలిపారు. ఇందులో రూ.97 వేల కోట్ల లోటు జీఎస్​టీ అమలు వల్ల ఏర్పడిందని తెలిపిన ఆర్థిక మంత్రి. మిగతా మొత్తానికి లాక్‌డౌన్‌ వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణమని తెలిపారు.
.
సుదీర్ఘంగా చర్చించిన తర్వాత పరిహారం చెల్లింపు విషయంలో రాష్ట్రాలకు రెండు ప్రతిపాదనల గురించి వివరంగా తెలియజేశాం. దీనిపై తమకు సమగ్ర సమాచారం అందించాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. రెండు ప్రతిపాదనలపై అధ్యయనం చేసేందుకు ఏడు రోజుల సమయం కావాలని, ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించుకుంటామని తెలిపాయి. దీనిపై నిర్ణయం కోసం మళ్లీ స్వల్పకాలిక జీఎస్టీ సమావేశం ఉంటుంది. అక్కడ రాష్ట్రాల అభిప్రాయాల ఆధారంగా పరిహారం చెల్లింపుపై మేం నిర్ణయం తీసుకుంటాం. ఇందుకోసం ఆర్బీఐతో చర్చించి రాష్ట్రాలు ద్వైమాసిక జీఎస్టీ పరిహారం పొందేలా చర్యలు తీసుకుంటాం.అని నిర్మలా సీతారామన్ తెలిపారు.