COVID-19 Aerosols: కరోనా వైరస్ కణాలు గాలిలో 33అడుగుల దూరం ప్రయాణించగలవు – సైంటిఫిక్ అడ్వైజర్
కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీస్ .. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కొత్త గైడ్‌లైన్స్ ఇష్యూ చేసింది. 'వ్యాప్తిని అడ్డుకోండి.. మహమ్మారిని చిత్తు చేయండి'

Covid 19 Aerosols
COVID-19 Aerosols: కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీస్ .. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కొత్త గైడ్‌లైన్స్ ఇష్యూ చేసింది. ‘వ్యాప్తిని అడ్డుకోండి.. మహమ్మారిని చిత్తు చేయండి’ అంటూ మాస్కులు వాడాలని సలహా ఇచ్చింది. దాంతో పాటు సోషల్ డిస్టెన్సింగ్, శానిటేషన్, వెంటిలేషన్ పాటించి SARS-Cov2 వైర్ ను అడ్డుకోవాలని సూచించింది.
వైరస్ వ్యాప్తిలో ఏరోసెల్స్(గాలి కణాలు) కీలకంగా వ్యవహరిస్తాయని.. ఇవి సుమారు 10మీటర్ల వరకూ ప్రయాణిస్తాయని చెప్తున్నారు. ఎటువంటి లక్షణాలు లేకపోయినా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి వెలువడే వైరస్ చాలా మందికి సోకేలా చేస్తుందని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అన్నారు.
ఎక్కువ వెంటిలేషన్ ఉన్న గదుల కంటే తక్కువ వెంటిలేషన్ ఉన్న ఇళ్లలో వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వ్యాప్తి చెందని అన్నారు. వెంటిలేషన్ అనేది వైరస్ వ్యాప్తిని ఒకరి నుంచి మరొకరికి రాకుండా అడ్డుకుంటుంది.
గైడ్ లైన్స్ ప్రకారం.. వెంటిలేషన్ అనేది ప్రాణాంతక వైరస్ నుంచి కాపాడుకోవడానికి కమ్యూనిటీ డిఫెన్స్ లాంటిది. ఒక వ్యక్తిలో ఉండే SARS CoV2 రెట్టింపు సంఖ్యలో ఇన్ఫెక్ట్ అవుతుంది. వ్యక్తుల్లో లేకుండా అది వ్యాప్తి చెందడం అంటూ జరగదు. వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వ్యాప్తి చెందకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్ అనేది తగ్గుతుంది.
దాదాపు వైరస్ అంతరించేపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. పరస్పర సహకారంతో లేదా సపోర్ట్ తోనే ఇది సాధించగలం. మాస్కులు, వెంటిలేషన్, సామాజిక, శానిటేషన్ నుంచి వైరస్ ను ఎదుర్కోవచ్చు.