CM Yogi Adityanath: మథుర, బృందావన్ కూడా పునరుద్ధరిస్తాం: సీఎం యోగి ఆదిత్యనాథ్

అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మథుర, బృందావన్, వింధ్యవాసిని ధామ్, నైమిశారణ్య ధామ్ వంటి ఆలయలు కూడా తెరపైకి వస్తున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

CM Yogi Adityanath: మథుర, బృందావన్ కూడా పునరుద్ధరిస్తాం: సీఎం యోగి ఆదిత్యనాథ్

Yogi Aditya

Updated On : May 30, 2022 / 7:52 AM IST

CM Yogi Adityanath: అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మథుర, బృందావన్, వింధ్యవాసిని ధామ్, నైమిశారణ్య ధామ్ వంటి ఆలయలు కూడా తెరపైకి వస్తున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అదివారం లక్నోలో జరిగిన యూపీ బిజెపి వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జ్ఞాన్వాపి మసీదు వివాదంలో న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల పునరుద్ధరించిన కాశీ విశ్వనాథ్ ఆలయానికి ప్రతిరోజూ సుమారు లక్ష మంది సందర్శకులు వస్తున్నారని యోగి అన్నారు. ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా నగరం తన పేరు ప్రాముఖ్యతను రుజువు చేస్తోందని ఆయన అన్నారు. యూపీలో బీజేపీ పాలనలో ఒక్క మత హింస కూడా జరగలేదని, రాష్ట్రంలో బలమైన శాంతిభద్రతల పరిస్థితికి ఇది అద్దం పడుతోందని యోగి అన్నారు.

other stories: PM Relief fund: కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పీఎం సహాయ ‘నిధి’ విడుదల

ఈద్ కు ముందు గత శుక్రవారం నమాజ్ ను రోడ్లపై నిర్వహించకపోవడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. అదే సమయంలో శ్రీరామనవమి, హనుమాన్ జయంతిని శాంతియుతంగా నిర్వహించామని తెలిపారు. మతపరమైన ప్రదేశాల ను౦డి లౌడ్ స్పీకర్లను తొలగి౦చడ౦ గురి౦చి ప్రస్తావిస్తూ “అనవసర శబ్దాన్ని తమ ప్రభుత్వం ఎలా తొలగి౦చిందో ప్రజలు గమనిస్తున్నారని” అన్నారు. ఇక యూపీలో బీజేపీ చారిత్రాత్మకంగా తిరిగి అధికారంలోకి రావడం పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు తక్షణమే కార్యాచరణను ప్రారంభించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 80 లోక్ సభ స్థానాలకు గాను కనీసం 75 స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో పార్టీ ముందుకు సాగాలని యోగి అన్నారు.

other stories: Hanuman Birth place: హనుమంతుడి జన్మస్థలం వివాదంలో తెరపైకి మరో కొత్త అంశం