Rahul Gandhi : గుల్మార్గ్‌లో మంచుపై స్కీయింగ్‌ చేస్తూ..ఎంజాయ్‌ చేస్తున్న రాహుల్‌ గాంధీ

భారత్ జోడో యాత్ర విజయవంతంగా పూర్తి అయ్యింది. పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాలు కూడా పూర్తి అయ్యాయి. దీంతో రాహుల్ గాంధీ రిలాక్స్ అవుతున్నారు. జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో మంచుపై స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Rahul Gandhi : గుల్మార్గ్‌లో మంచుపై స్కీయింగ్‌ చేస్తూ..ఎంజాయ్‌ చేస్తున్న రాహుల్‌ గాంధీ

Rahul Gandhi enjoys ‘perfect vacation’ in Gulmarg ski resort

Updated On : February 16, 2023 / 12:50 PM IST

Rahul Gandhi : భారత్ జోడో యాత్ర విజయవంతంగా పూర్తి అయ్యింది. పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాలు కూడా పూర్తి అయ్యాయి. దీంతో రాహుల్ గాంధీ రిలాక్స్ అవుతున్నారు. జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో మంచుపై స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రెండు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కశ్మీర్‌ వెళ్లిన రాహుల్‌.. మంచుపై స్కీయింగ్‌ చేస్తూ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. రాహుల్ గాంధీ మంచుపై స్కీయింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా..రాహుల్‌ గాంధీ ఇటీవలే కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ‘భారత్‌ జోడో యాత్ర’ పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసి విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో రాహుల్‌ 12 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం గుండా సుమారు 4వేలకు పైగా కిలోమీటర్లు నడిచారు.

జనవరి 29న కశ్మీర్‌లో యాత్ర ముగిసింది. ఆ తరువాత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఇలా బిజీ బిజీ షెడ్యూల్ తరువాత రాహుల్ రిలాక్స్ అవుతున్నారు మంచుపై స్కీయింగ్ చేస్తూ.స్థానిక మీడియా రాహుల్ ను ఏవో ప్రశ్నలు అడగటానికి యత్నించగా నమస్కార్ అంటూ సున్నితంగా తిరస్కరించారు. తరువాత రాహుల్ పర్యాటకులతో కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చారు.