ప్రచారంలోనే కుప్పకూలిన BJP MLA : మృతి
బీజేపీ ఆగ్రా ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఉత్తరప్రదేశ్ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది.

బీజేపీ ఆగ్రా ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఉత్తరప్రదేశ్ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది.
ఆగ్రా: బీజేపీ ఆగ్రా ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఉత్తరప్రదేశ్ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నేత..ఆగ్రా నార్త్ ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. కంగారు పడిన బీజేపీ నేతలు..కార్యకర్తలు ఆయన్ని వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
Read Also : తలపై లేజర్ లైట్ : రాహుల్ కు ప్రాణహాని..హోంశాఖకు కాంగ్రెస్ లేఖ
బీజేపీల్లో మంచి పట్టున్న నాయకుడిగా జగన్ ప్రసాద్‌కు పేరుంది. ఆయన ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ ప్రసాద్ గార్గ్ మృతితో ఆగ్రాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జగన్ 68 సంవత్సరాల ప్రసాద్ కు భార్యా..ఇద్దరు కుమార్తెలు..ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా జగన్ ప్రసాద్ అంత్యక్రియలు ఏప్రిల్ 11న జరిగాయని ఆయన మేనల్లుడు మనోజ్ తెలిపారు.
Read Also : EVMలు బాగా పని చేస్తున్నాయ్.. తప్పుడు వార్తలు నమ్మొద్దు : ఈసీ ద్వివేదీ