Oreo Pakode : ఓరియో బిస్కెట్లతో పకోడీ..వీడియో వైరల్

శనగపిండిలో ఉల్లిగడ్డలు లేదా ఆలుగడ్డలు..ఇతరత్రా వేయడం కామన్. కానీ..ఈ వ్యక్తి మాత్రం ఓరియో బిస్కెట్లను వేసి పకోడీలు చేస్తున్నాడు.

Oreo Pakode : ఓరియో బిస్కెట్లతో పకోడీ..వీడియో వైరల్

Pakoda

Updated On : November 8, 2021 / 10:17 AM IST

Ahmedabad Oreo Pakode : వంటలు ఒక్కోక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. వెరైటీగా ప్రయత్నిస్తుంటారు. వెరైటీ..వెరైటీ వంటకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాము వినూత్నంగా ప్రయత్నించిన వంటలను చూడండి..అంటూ..పోస్టులు చేస్తుంటారు. కొంతమంది చేసిన వంటలను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇలా కూడా వంటలు చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా.. ఓ వ్యక్తి చేసిన పకోడీలు చూసి తెల్లమొహం వేస్తున్నారు. గిదేం పకోడీలు రా బాబు..అంటున్నారు నెటిజన్లు.

Read More : Bihar : పేకాట ఆడుతున్నారని పోలీసు వెళితే..అతడినే చితకబాదిన యువకులు

అహ్మదాబాద్ లో ఓ వీధిలో ఓ వ్యక్తి పకోడీలు చేస్తున్నాడు. పకోడీలు చేసేందుకు శనగపిండి వాడుతారనే సంగతి తెలిసిందే. శనగపిండిలో ఉల్లిగడ్డలు లేదా ఆలుగడ్డలు..ఇతరత్రా వేయడం కామన్. కానీ..ఈ వ్యక్తి మాత్రం ఓరియో బిస్కెట్లను వేసి పకోడీలు చేస్తున్నాడు. బాగా వేయించిన అనంతరం పచ్చిమిర్చి…ఖర్జూరంతో కలిసి పకోడీలు తినాలని అందిస్తున్నాడు. ఓ ప్లేట్ ఓరియో పకోడీ..రూ. 20 చొప్పున విక్రయిస్తున్నాడంట. Foodie Incarnate పేరిట యూ ట్యూబ్ లో దీనికి సంబంధించిన వీడియో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.