Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో కూలిన విమానం.. ఫ్లైట్‌లో 242 మందికిపైగా పాసింజర్స్.. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్‌ఇండియాకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది.

Ahmedabad Plane Crash
Ahmedabad Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెట్టును ఢీకొట్టి విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం కూలిన వెంటనే దట్టమైన పొగలు ఆ ప్రాంతంలో అలముకున్నాయి.
Prayers for safety of those onboard. Hope pakistan has not shot it down?? pic.twitter.com/Ncmbitqusm
— Desh Bandhu Pandey (@dracula_empathy) June 12, 2025
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఏడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. గాయపడిన వారిని రెస్క్యూ టీమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమాన ప్రమాదంపై గుజరాత్ సీఎంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదం తీవ్రతకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
VIDEO | Ahmedabad: Smoke seen emanating from airport premises. More details are awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7)
(Source: Third Party) pic.twitter.com/qbO486KoEo
— Press Trust of India (@PTI_News) June 12, 2025
ప్రమాదానికి గురైన విమానం వైడ్‌బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. మధ్యాహ్నం 1.39గంటల సమయంలో చెట్టును ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో విమానం 825 అడుగుల ఎత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీ ఉండటంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమాన కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజిన్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
#WATCH | Debris at Air India plane crash site in Ahmedabad; Fire Services and other agencies present at the site pic.twitter.com/z9XsemwDnx
— ANI (@ANI) June 12, 2025
మరోవైపు ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రుపానీ కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఘటన గురించి తెలిసిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో మాట్లాడారు. ఇప్పటికే 90 మందికి పైగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ పొగ దట్టంగా ఉండడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.