Air India: వెయిట్ చేయాల్సిందే.. నెల తర్వాత టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా

నష్టాలను చవిచూస్తున్నామంటూ అమ్మకానికి పెట్టిన ఎయిరిండియాను టాటా గ్రూప్ చేతికివ్వడానికి మరో నెల సమయం పట్టే అవకాశంముంది. జనవరి 2022 ముగిసేనాటికల్లా పూర్తి ప్రోసీజర్ పూర్తి....

Air India: వెయిట్ చేయాల్సిందే.. నెల తర్వాత టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా

Airindia

Updated On : December 28, 2021 / 7:58 AM IST

Air India: నష్టాలను చవిచూస్తున్నామంటూ అమ్మకానికి పెట్టిన ఎయిరిండియాను టాటా గ్రూప్ చేతికివ్వడానికి మరో నెల సమయం పట్టే అవకాశంముంది. జనవరి 2022 ముగిసేనాటికల్లా పూర్తి ప్రోసీజర్ పూర్తి చేయనున్నారట. వేలంలో సొంతం చేసుకున్న టాటా సన్స్ కు అప్పగిస్తామని అక్టోబరులోనే చెప్పారు.

20ఏళ్లలో చేసిన తొలి ప్రైవేటీకరణలో భాగంగా ఎయిరిండియా, వంద శాతం ఈక్విటీ షేర్లతో పాటు గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఏఐఎస్ఏటీఎస్ లో 50శాతం వాటాను ఇవ్వాల్సి ఉంది. ఆ సమయంలో ప్రభుత్వం డిసెంబర్ చివరికల్లా ట్రాన్సాక్షన్లు పూర్తి చేస్తామని చెప్పింది. అందులో టాటాస్ నుంచి వచ్చే రూ.2వేల 700కోట్లు కూడా ఉన్నాయి.

అక్టోబర్ 25న ప్రభుత్వం టాటా సన్స్ తో చేసుకున్న అగ్రిమెంట్ లో సంతకం పెట్టి.. రూ. 18వేల కోట్లకు ఎయిరిండియాను కొనుగోలు చేసింది. ఇందులో భాగంగానే రూ.2వేల 700క్యాష్ ఇవ్వాల్సి ఉండగా…. ఎయిర్ లైన్ కు ఉన్న రూ.15వేల 300కోట్ల అప్పును కూడా తమ ఖాతాలో వేసుకుంది.

ఇవి కూడా చదవండి: కంటి చుక్కలు వేసుకోండి.. రీడింగ్ గ్లాసులు పక్కకుపెట్టేయండి