Eye Drops: కంటి చుక్కలు వేసుకోండి.. రీడింగ్ గ్లాసులు పక్కకుపెట్టేయండి

ఇటువంటి ఒక విషయం జరుగుతుందని కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. కంటి చూపును ఇంప్రూవ్ చేసి రీడింగ్ గ్లాసెస్ పక్కకుపెట్టేసే సమయం వచ్చేసింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ ఈ కంటి చుక్కలకు..

Eye Drops: కంటి చుక్కలు వేసుకోండి.. రీడింగ్ గ్లాసులు పక్కకుపెట్టేయండి

Eye Sight

Updated On : December 28, 2021 / 7:40 AM IST

Eye Drops: ఇటువంటి ఒక విషయం జరుగుతుందని కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. కంటి చూపును ఇంప్రూవ్ చేసి రీడింగ్ గ్లాసెస్ పక్కకుపెట్టేసే సమయం వచ్చేసింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ ఈ కంటి చుక్కలకు అప్రూవల్ ఇచ్చింది. వయస్సు రీత్యా పెరిగే ప్రెస్బైపియా అనే సమస్య నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడతాయట.

128మిలియన్ మంది ఉన్న యునైటెడ్ స్టేట్స్ లో ఈ సమస్య చాలా కామన్ గా కనిపిస్తుందట. కళ్లలోని కండరాలను మరింత కష్టపెట్టి ముందున్న వస్తువులను చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కండీషన్ కామన్ గా కనిపిస్తుంది కదా అని సర్దుకుపోయి బతకలేం కదా. అందుకే ఓ అడుగు ముందుకేశారు.

pilocarpine అనే యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్ తో ఉండే డ్రాప్స్ కంటిపాప సైజు తగ్గించి కంటి దృష్టిని ఇంప్రూవ్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి: పిల్లలకు యూట్యూబే పాపులర్ యాప్

‘ప్రకటించినప్పటి నుంచి అప్రూవల్ పొందే వరకూ ఎదురుచూస్తూనే ఉన్నా. రీడర్స్ ప్రతి ఒక్కరూ దీనిని కావాలనుకుంటారు’ ఆప్తమాలజిస్ట్ డా.యూనా చెప్తున్నారు.

‘జనరిక్ పిలోకార్పైన్ కంటిచూపును 1.25శాతం ఇంప్రూవ్ చేసి పిన్ మోల్ ఎఫెక్ట్ ద్వారా చూపును వృద్ధి చేస్తుంది. కంటిపాపను దాదాపు 2 నుంచి 3గంటల వరకూ చిన్నదిగా చేస్తుంది. దృష్టి క్లియర్ చేసిన తర్వాత మళ్లీ సమస్యను పెంచదు. ఇది 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్కులకు మంచి ఫలితాలు ఇస్తుంది’ అని చెబుతున్నారు డా. యునా.

ఇవి కూడా చదవండి : స్వల్పంగా పెరిగిన పసిడి ధర