హైజాక్ వార్నింగ్ కాల్ : ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్

భారత్‌లోని ఎయిర్‌పోర్టులన్నింటిలో హై అలర్ట్ విధించారు. ఎయిరిండియా విమానం హైజాక్‌ చేయనున్నారనే బెదిరింపు వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్‌ఎఫ్ దళాలు

  • Published By: veegamteam ,Published On : February 24, 2019 / 05:39 AM IST
హైజాక్ వార్నింగ్ కాల్ : ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్

Updated On : February 24, 2019 / 5:39 AM IST

భారత్‌లోని ఎయిర్‌పోర్టులన్నింటిలో హై అలర్ట్ విధించారు. ఎయిరిండియా విమానం హైజాక్‌ చేయనున్నారనే బెదిరింపు వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్‌ఎఫ్ దళాలు

భారత్‌లోని ఎయిర్‌పోర్టులన్నింటిలో హై అలర్ట్ విధించారు. ఎయిరిండియా విమానం హైజాక్‌ చేయనున్నారనే బెదిరింపు వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్‌ఎఫ్ దళాలు దేశంలోని విమానాశ్రలన్నింటిలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. ప్రయాణికులను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విమానాశ్రయాల్లోకి అనుమతిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు శనివారం(ఫిబ్రవరి-23-2019) ఓ బెదిరింపు కాల్ వచ్చింది. సంస్థకు చెందిన ఓ విమానాన్ని హైజాక్  చేసి పాకిస్థాన్‌కు దారి మళ్లిస్తున్నట్లు బెదిరించారు. దీంతో అధికారులు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయల్లో హై అలర్ట్ విధించారు.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశంలోని విమానాశ్రయాలన్నింటిలో భద్రతను టైట్ చేశారు. తాజాగా వచ్చిన బెదిరింపు కాల్‌తో అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. తమకు వచ్చిన కాల్ గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది? అందులో వాస్తవమెంత అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గందరగోళం సృష్టించడానికా, అధికారులను తప్పుదోవ పట్టించడానికా, లేక ఆకతాయిలు ఎవరైనా ఆ కాల్ చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. కారణం ఏదైనా కాల్ ను మాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని భద్రతా అధికారులు వెల్లడించారు.

అన్ని ప్రధాన ఎయిర్ పోర్టుల్లో అదనపు బలగాలు, క్విక్ యాక్షన్ టీమ్‌లను సిద్ధంగా ఉంచినట్లు సీఐఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. కార్గో, వాహనాల ఎంట్రీ గేట్ల దగ్గర అదనపు సిబ్బందిని నియమించారు.