మత పెద్దలతో అజిత్ ధోవల్ కీలక సమావేశం
అయోధ్య పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నిమతాల పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

అయోధ్య పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నిమతాల పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
అయోధ్య పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నిమతాల పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమాజంలో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకోవటానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు ముస్లిం పెద్దలు, రామ్ దేవ్ బాబా, శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామితోపాటు మైహోం గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ రామేశ్వరరావు హాజరయ్యారు.
అజిత్ దోవల్ నివాసంలో సమావేశమైన అన్ని వర్గాల మత పెద్దలు సుప్రీం తీర్పును స్వాగతించారు. ఐక్యత మరియు శాంతి కోసం తీర్పును స్వీకరించి ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా సామరస్యంగా మెలగాలని ఈ సందర్భంగా మత పెద్దలు ప్రజలను కోరారు.
అజిత్ ధోవల్ ఇంట్లో జరిగిన హిందూ, ముస్లిం మతపెద్దల సమావేశం బాగా జరిగిందన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి. అంతా ముక్తకంఠంతో సుప్రీం తీర్పును గౌరవించారని తెలిపారు. ఎలాంటి సమస్యనైనా.. చర్చలతో పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. త్వరలోనే మళ్లీ సమావేశమై ఇకపై ఏం చేయాలన్న దానిపై చర్చిస్తామని చెప్పారు. భారత్ లోని భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవించడం మన విధి అన్నారు.