2024 Elections: లోక్‭సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు గట్టి ప్లానే వేసిన అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ పార్టీ కూటమితో ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది. అయితే యూపీలో సీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో పొత్తు నిరాకరించడం పట్ల అఖిలేష్ కోపంగా ఉన్నారు.

2024 Elections: లోక్‭సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు గట్టి ప్లానే వేసిన అఖిలేష్ యాదవ్

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కూటమి నుంచి విడిగా పోటీ చేసింది. కారణం.. ఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. నిజానికి పొత్తు కోసం ఎస్పీ పలు ప్రయత్నాలు చేసినప్పటికీ కాంగ్రెస్ వాటిని పెడచెవిన పెట్టింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఒంటరిగా బరిలోకి దిగారు. ఒక రకంగా చెప్పాలంటే.. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్లే పోటీ చేశారు.

ఇక ఇది పక్కన పెడితే.. పొత్తు ధర్మాన్ని కాలరాసినందుకు కాంగ్రెస్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఎస్పీ నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో రెండు ప్లాట్లు కొనుగోలు చేసింది. ఖజురహో నుంచి మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్‌వాదీ పార్టీ తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎస్పీ చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: రాజస్థాన్‭లో మళ్లీ కీలకంగా మారనున్న బీఎస్పీ.. ఈసారి మద్దతు ఎవరికి? ఎలా ఇస్తారో అప్పుడే చెప్పేశారు

లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలన్నది ఎస్పీ వ్యూహం. మధ్యప్రదేశ్‌లోని 6-7 లోక్‌సభ స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులను నిలబెట్టొచ్చని అంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బుందేల్‌ఖండ్ స్థానాలపై ఎస్పీ కన్నేసింది. ఇండియా కూటమిలో సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన భాగం. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ పార్టీ కూటమితో ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది. అయితే యూపీలో సీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో పొత్తు నిరాకరించడం పట్ల అఖిలేష్ కోపంగా ఉన్నారు.

బుందేల్‌ఖండ్‌ నుంచి మధ్యప్రదేశ్‌ వరకు కార్యాలయాలను ప్రారంభించడం ద్వారా తన మద్దతును పెంచుకునే వ్యూహంపై ఎస్పీ కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు బుందేల్‌ఖండ్‌లో కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలేష్ యాదవ్ పార్టీ ప్రయత్నిస్తోందని రాజకీయ పండితులు అంటున్నారు. మధ్యప్రదేశ్‌లో ఇండియా కూటమి నుంచి కాకుండా విడిగా పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ పడొచ్చట. కాంగ్రెస్ ఓటు బ్యాంకర్‌గా ఎస్పీ దూసుకుపోతుంది. కాంగ్రెస్ ఓట్లు చీలిపోవడం వల్ల ఎన్నికల్లో బీజేపీ లాభపడవచ్చు.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: పట్టు వదలని బీజేపీ.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యేనా?